Video Viral: కదులుతున్న ట్రైన్‌‌లో యువకుడు స్టంట్స్.. ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్.. షాకింగ్ వీడియో వైరల్..

రైలు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో  TTE లేదా RPF సిబ్బంది రైలులో తిరుగుతూ ప్రయాణీకులను హెచ్చరిస్తూ ఉంటారు.  ఇందులో రైలు తలుపుల వద్ద నిలబడవద్దు, లేదా కిటికీలోంచి చేతులు బయటకు పెట్టవద్దు అంటూ చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది కదులుతున్న రైలులోనే రకరకాల విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. 

Video Viral: కదులుతున్న ట్రైన్‌‌లో యువకుడు స్టంట్స్.. ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్.. షాకింగ్ వీడియో వైరల్..
Train Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2024 | 11:54 AM

ఒకచోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి ప్రయాణీకులు ఎక్కువగా ఇష్టపడే ప్రయాణసాధనం రైళ్లు. పేద వారి నుంచి ఉన్నత వర్గాల వారు కూడా నచ్చే మెచ్చే ప్రయాణం రైలు ప్రయాణం. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకొక్కసారి రైలులో సీట్లు నిండిపోయి.. నిల్చుకోవడనికి కూడా ప్లేస్  ఉండని సందర్భాలు ఉంటాయి. కనుక రైలు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో  TTE లేదా RPF సిబ్బంది రైలులో తిరుగుతూ ప్రయాణీకులను హెచ్చరిస్తూ ఉంటారు.  ఇందులో రైలు తలుపుల వద్ద నిలబడవద్దు, లేదా కిటికీలోంచి చేతులు బయటకు పెట్టవద్దు అంటూ చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది కదులుతున్న రైలులోనే రకరకాల విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు.

అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక బాలుడు కదులుతున్న రైలులో  ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ యువకుడిని రక్షించాల్సి వచ్చింది. ఆ బాలుడు రైలు కిటికీలోంచి సగం బయటకి వచ్చి రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా అతని ప్రాణాలు పోతాయి. అయినా సరే ఆ యువకుడు అస్సలు భయపడలేదు. అతను కొన్ని సెకన్ల పాటు కిటికీ బయటకు వచ్చి ట్రైన్ మీదకు ఎక్కి విన్యాసాలు చేశాడు. ఇలా ట్రైన్ పైకి ఎక్కి రకరకాల స్టంట్స్  చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. రైలులో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే ఆ యువకుడు అదృష్టవంతుడు అని చెప్పవచ్చు.. అతని ప్రాణందక్కింది. అయితే ఒక చేయి, శరీరం తీవ్రంగా కాలిపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

గూస్ బంప్స్ తెస్తున్న ఈ వీడియో @gillujojo అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. దాదాపు ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘అతను బతికాడు, అదే పెద్ద విషయం’ అని ఎవరో అంటే ‘యమరాజు ఈ సమయంలో అయోధ్యలో ఉండి ఉండాలి, అందుకే ఆ యువకుడు ప్రాణాలను దక్కించుకున్నాడు అని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక