Video Viral: చదువు కోసం విదేశం వెళ్లినా మూలాలు మరచిపోని స్టూడెంట్.. కాన్వొకేషన్ సెంటర్ లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు..
భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే విదేశాలలో నివసిస్తున్న తర్వాత కూడా వారు తమ సంస్కృతిని మరచిపోవడం లేదు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియో భారతీయులు గర్వించేలా చేసింది. వాస్తవానికి ఈ వీడియోలో బ్రిటన్‌లో జరిగిన ఒక కాన్వొకేషన్ వేడుకలో ఒక భారతీయ విద్యార్థి ఉపాధ్యాయుల పాదాలను తాకి నమస్కారం చేశాడు.
ఏ దేశం వెళ్లినా, ఎక్కడ ఉన్నా.. నీ దేశాన్ని నీ మూలలను మరచిపోవద్దు అని రాయప్రోలు చెప్పిన మాటను నేటి యువత గుర్తు పెట్టుకుని ఆచరిస్తున్నారు. అవును చదువు కోసమో, ఉద్యోగం కోసమో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినా దేశాన్ని, సంస్కృతిని మర్చిపోలేదని చెప్పకనే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే విదేశాలలో నివసిస్తున్న తర్వాత కూడా వారు తమ సంస్కృతిని మరచిపోవడం లేదు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ వీడియో భారతీయులు గర్వించేలా చేసింది.
వాస్తవానికి ఈ వీడియోలో బ్రిటన్‌లో జరిగిన ఒక కాన్వొకేషన్ వేడుకలో ఒక భారతీయ విద్యార్థి ఉపాధ్యాయుల పాదాలను తాకి నమస్కారం చేశాడు. అంతేకాదు ‘జై శ్రీరామ్’ అంటూ నామ స్మరణ చేస్తూ కనిపించాడు. వేడుకలో భారీగా చప్పట్ల మధ్య ఇండియన్ స్టూడెంట్ వేదికపైకి ఎక్కిన వెంటనే ‘జై శ్రీరాం’ అంటూ బిగ్గరగా అరవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత నేరుగా వెళ్లి గురువుగారి పాదాలను తాకాడు. ఈ బాలుడు బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది చూసిన ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి.
వీడియో చూడండి
Be proud of your roots, values and culture – Student touches feet of the teacher and chants 'Jai Siya Ram' at Convocation Ceremony in Leicester, UK pic.twitter.com/LYTKybw4hl
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 25, 2024
ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @MeghUpdates పేరుతో IDతో భాగస్వామ్యం చేయబడింది. మీ మూలాలు, విలువలు, సంస్కృతి గురించి గర్వపడండి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో జరిగిన కాన్వొకేషన్ వేడుకలో స్టూడెంట్ తన టీచర్ పాదాలను తాకి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశాడు.
కేవలం 29 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల 55 వేలకు పైగా వీక్షించగా, 20 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ ఇచ్చారు. యువ తరానికి చెందిన హిందువులు తమ అద్భుతమైన మూలాలు, విలువలు, సంస్కృతి గురించి గర్వపడుతున్నారు. ఇది చూడటం చాలా బాగుంది’ అని కామెంట్ చేయగా.. మరొకరు ‘హిందువులకు, దేశానికి ఇలాంటి వ్యక్తుల వాళ్ళ మాత్రమే గౌరవం లభిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..