Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంటి మెట్ల క్రింద పెట్టవద్దు.. ఆర్ధిక ఇబ్బందులు తప్పవట
ఇల్లు చిన్నదిగా ఉండటంతో వివిధ అవసరాలకు మెట్ల క్రింద ఖాళీ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది మెట్ల కింద టాయిలెట్, బాత్రూం, వంట గది, పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే చాలా మంది మెట్ల కింద ఖాళీ స్థలంలో వివిధ రకాల వస్తువులను పెట్టడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో చెత్తను ఉంచడం లేదా బూట్లు, చెప్పులు వంటివి మెట్ల కింద ఖాళీ స్థలంలో ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం చాలా తప్పు.
కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు పూరిళ్లు, పెంకుటిల్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వాటి స్థానంలో డాబాలు వెలుస్తున్నాయి. స్థలం తక్కువైనా సరే డాబా ఇళ్లను కట్టుకోవాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ఇంట్లోనే మెట్లను నిర్మించుకుంటున్నారు. అయితే ఇల్లు చిన్నదిగా ఉండటంతో వివిధ అవసరాలకు మెట్ల క్రింద ఖాళీ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. కొంతమంది మెట్ల కింద టాయిలెట్, బాత్రూం, వంట గది, పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే చాలా మంది మెట్ల కింద ఖాళీ స్థలంలో వివిధ రకాల వస్తువులను పెట్టడానికి ఉపయోగిస్తారు. ఇంట్లో చెత్తను ఉంచడం లేదా బూట్లు, చెప్పులు వంటివి మెట్ల కింద ఖాళీ స్థలంలో ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం చాలా తప్పు.
మెట్ల కింద వీటిని నిర్మించవద్దు
వంటగది, టాయిలెట్, బాత్రూమ్ లేదా పూజ గది ఎప్పుడూ మెట్ల క్రింద నిర్మించకూడదు. మెట్ల కింద ఉండే స్థలాన్ని బూట్లు, చెప్పులు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదు. వాస్తు శాస్త్రంలో మెట్ల క్రింద ఏదైనా వస్తువులను పెట్టుకోవడం వాస్తు దోషంగా పరిగణిస్తారు. దీని కారణంగా ఇంటి పురోగతి, ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది.
నీటి ట్యాంక్ లేదా కుళాయి
ఇంట్లో మెట్ల కింద కుళాయి లేదా ట్యాంక్ అమర్చబడి ఉంటే అప్పుడు నీరు అనవసరంగా ప్రవహించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా జరిగితే ఇంట్లోని డబ్బు కూడా నీళ్లలా ప్రవహిస్తుంది.
మెట్ల కింద చెత్తను పెట్టకండి
చాలా మంది ఇంటి మెట్ల కింద ఉన్న స్థలాన్ని డస్ట్‌బిన్‌లను ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా తప్పు. వాస్తు ప్రకారం ఇంటి మెట్ల క్రింద డస్ట్‌బిన్‌ను ఉంచడం వల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఫోటోలు
చాలా మంది ఇంట్లోని మెట్ల కింద ఖాళీ స్థలంలో ఫ్యామిలీ ఫోటోలను పెట్టుకుంటారు. వాస్తు ప్రకారం మెట్ల కింద ఫ్యామిలీ ఫోటోలు పెట్టడం అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసర తగాదాలు, పరస్పర విభేదాలు తలెత్తుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు