Pakistan: పాకిస్తాన్ లో మరణ మృదంగం.. విజృంభిస్తోన్న న్యుమోనియా.. 200 మంది చిన్నారుల మృతి..

గత మూడు వారాల్లో విపరీతమైన శీతలగాలుల వలన న్యుమోనియా విజృంభిస్తోందని    పంజాబ్ ప్రావిన్స్‌లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. మరణించిన పిల్లల్లో చాలామంది చిన్నారులకు "న్యుమోనియాకు టీకాలు వేయలేదు. పోషకాహార లోపం,  తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది." చలి తీవ్రత కారణంగా జనవరి 31 వరకు ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

Pakistan: పాకిస్తాన్ లో మరణ మృదంగం.. విజృంభిస్తోన్న న్యుమోనియా.. 200 మంది చిన్నారుల మృతి..
Pakistan Pneumonia
Follow us
Surya Kala

|

Updated on: Jan 27, 2024 | 10:47 AM

పాకిస్తాన్ లో గత మూడు వారాల నుంచి శీతాకాల గాలులు వీస్తున్నాయి. దీంతో న్యుమోనియా విజృంభిస్తోంది.  జనవరి 1 నుండి ప్రావిన్స్‌లో మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 220 మరణాలు సంభవించాయి. వీరిలో ఎక్కువగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే అని అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్షియల్ రాజధాని లాహోర్‌లో 47 మరణాలు సంభవించాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. గత మూడు వారాల్లో విపరీతమైన శీతలగాలుల వలన న్యుమోనియా విజృంభిస్తోందని    పంజాబ్ ప్రావిన్స్‌లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

మరణించిన పిల్లల్లో చాలామంది చిన్నారులకు “న్యుమోనియాకు టీకాలు వేయలేదు. పోషకాహార లోపం,  తల్లిపాలు లేని కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.” చలి తీవ్రత కారణంగా జనవరి 31 వరకు ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

పంజాబ్‌లోని ఇమ్యునైజేషన్‌పై ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ తమ దేశంలో పుట్టిన  శిశువులకు ఆరు వారాల తర్వాత  పిసివి అనే మొదటి యాంటీ-న్యుమోనియా వ్యాక్సిన్‌ని ఇస్తారని పేర్కొన్నారు.  పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాక్సిన్ అనేక రకాల వ్యాధులపై పోరాడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

“న్యుమోనియా బాక్టీరియా, వైరస్ రెండింటి వలన సంభవించవచ్చని.. కనుక టీకాలు వేసిన పిల్లలు బ్యాక్టీరియా సంక్రమణ నుంచి సురక్షితంగా ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పిల్లలు న్యుమోనియా బారిన పడకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, ఉన్ని దుస్తులను  ధరించాలని ప్రభుత్వం కోరింది. అంతేకాదు న్యుమోనియా బారిన పడకుండా పిల్లలను రక్షించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీనియర్ వైద్యులను కోరింది.  చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా వ్యాపిస్తుందని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!