AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York City: అమెరికాలో ఆ నగరంలో జీవించడం మరింత డేంజర్‌.. సోషల్‌ మీడియానే అసలు కారణం

అమెరికాలోని న్యూయార్క్‌ గురించి తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడు న్యూయార్క్‌ అత్యంత ప్రమాదకర నగరంగా అక్కడి మేయరే చెబుతున్నారు .అంతేకాదు ఇటీవల న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. పర్యావరణ టాక్సిన్, పబ్లిక్ హెల్త్ హాజర్డ్‌గా ప్రకటిస్తూ పొగాకు, తుపాకుల కేటగిరీలో చేర్చారు. ఈ షాకింగ్‌ వార్త గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

New York City: అమెరికాలో ఆ నగరంలో జీవించడం మరింత డేంజర్‌.. సోషల్‌ మీడియానే అసలు కారణం
Newyork City
Nikhil
|

Updated on: Jan 27, 2024 | 7:30 AM

Share

భారతదేశంలో విదేశాలకు వెళ్లి జీవించాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగుతుంది. వీరిలో కూడా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అమెరికాలో డాలర్‌ వేట ఎంత ముఖ్యంగా భద్రతపరంగా కూడా చాలా బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. అయితే అమెరికాలోని న్యూయార్క్‌ గురించి తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడు న్యూయార్క్‌ అత్యంత ప్రమాదకర నగరంగా అక్కడి మేయరే చెబుతున్నారు .అంతేకాదు ఇటీవల న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. పర్యావరణ టాక్సిన్, పబ్లిక్ హెల్త్ హాజర్డ్‌గా ప్రకటిస్తూ పొగాకు, తుపాకుల కేటగిరీలో చేర్చారు. ఈ షాకింగ్‌ వార్త గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

న్యూయార్క్‌ ఈ నగరం ఇలా తయారు కావడానికి ముఖ్యంగా సోషల్‌ మీడియానే కారణమని మేయర్‌ పేర్కొన్నారు. టిక్ టాక్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల కారణంగానే యువత చెడు మార్గాలవైపు పయనిస్తున్నారని ఆడమ్స్‌ విమర్శించాడు, పిల్లలలో మానసిక ఆరోగ్య సమస్యలకు మూడు ప్లాట్‌ఫారమ్స్‌ కారణమని నిందించాడు. టీనేజ్ డిప్రెషన్‌ స్థాయిలు దశాబ్దంలో వారి అత్యధిక స్థాయిలను తాకినట్లు తాజా సర్వేల ఆధారంగా వెల్లడైందని పేర్కొన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు టెక్-ఫ్రీ టైమ్స్ విధించాలని న్యూయార్క్ మేయర్ సలహాలో ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వారి నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం, వారి భావోద్వేగాలను ట్రాక్ చేయడం గురించి ఆలోచించాలని కోరారు. న్యూయార్క్‌ నగరంలోని ఆరోగ్య, మానసిక పరిశుభ్రత విభాగం కూడా సామాజిక మాధ్యమాలకు అపరిమిత ప్రాప్యత, వినియోగాన్ని ప్రజారోగ్యాని ప్రమాదమని గుర్తించింది.

న్యూయార్క్‌లోని డాక్టర్‌ అశ్విన్ వాసన్ న్యూయార్క్ నగరంలో సోషల్ మీడియాను ప్రజారోగ్య ప్రమాదంగా అధికారికంగా పేర్కొంటూ హెల్త్ కమీషనర్ సలహాను జారీ చేస్తున్నారని ఆడమ్స్ తన స్టేట్ ఆఫ్ ది సిటీ ప్రసంగంలో ప్రకటించారు. వారం రోజుల్లో 77 శాతం న్యూయార్క్ నగరంలోని హైస్కూలర్లు హోమ్‌వర్క్‌తో సహా రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ గంటలు స్క్రీన్ల ముందు గడిపారని 2021 సర్వేను ఉదహరించారు. ముఖ్యంగా మానిసిక ఆరోగ్యపరంగా పిల్లలపై సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్రమాదాన్ని గుర్తించిన మొదటి ప్రధాన అమెరికన్ నగరంగా న్యూయార్క్‌ నిలిచింది. పొగాకు, తుపాకీలతో జరిగే ప్రమాదాల మాదిరిగానే సోషల్ మీడియాను ప్రజారోగ్య ప్రమాదంగా పరిగణిస్తున్నామని ఆడమ్స్‌ ప్రకటించారు. ఈ ప్రమాదాన్ని ఇప్పటికైన టెక్‌ కంపెనీలు గుర్తించాలని పేర్కొంటున్నారు. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..