Israel Gaza: ఇజ్రాయెల్ అదుపులో గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ.! 210 మంది పాలస్తీనీయన్లు మృతి.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని తమ పదాతి దళాలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. హమాస్ నేతలు దాక్కున్న సొరంగాల్లోకి తమ సైన్యం ప్రవేశించినట్లు తెలిపింది. మరోవైపు నగరంలోని రెండు ప్రధాన ఆసుపత్రుల దగ్గర హోరాహోరీ పోరు జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇచ్చింది. ఖాన్ యూనిస్‌ను దిగ్బంధించిన ఇజ్రాయెల్ దళాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా స్థానిక ప్రజలకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని తమ పదాతి దళాలు చుట్టుముట్టాయని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. హమాస్ నేతలు దాక్కున్న సొరంగాల్లోకి తమ సైన్యం ప్రవేశించినట్లు తెలిపింది. మరోవైపు నగరంలోని రెండు ప్రధాన ఆసుపత్రుల దగ్గర హోరాహోరీ పోరు జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ఇచ్చింది. ఖాన్ యూనిస్‌ను దిగ్బంధించిన ఇజ్రాయెల్ దళాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా స్థానిక ప్రజలకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మధ్యదరా సముద్రానికి ఆనుకొని ఉన్న అల్-మవాసీ ప్రాంతానికి వెళ్లమంటూ సూచిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులపై ట్యాంకులు అడ్డంగా నిలిచి ఉన్నాయని, అటు వైపు వెళ్లడం సాధ్యం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో 210 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారని, మొత్తం మృతుల సంఖ్య 25,700కు చేరిందని బుధవారం గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. గాజాలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని 24 ఆస్పత్రుల్లో ఏడు మాత్రమే ప్రస్తుతం పాక్షికంగా పనిచేస్తున్నాయని చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

