Real Estate Crisis: రియల్ ఎస్టేట్ సంస్థ వింత ఆఫర్.. మా వెంచర్ లో ఇల్లు కొనండి భార్య ఫ్రీ అని ప్రకటన
ఒకటి కొనే ఒకటి ఫ్రీ అని.. లేదా లక్కీ డ్రా తీస్తే వస్తువులు బంపర్ బహుమతులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను గిఫ్ట్ అంటూ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆ ఆఫర్ విని షాక్ తింటున్నారు కూడా.. డ్రాగన్ కంట్రీలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ వద్ద ఇల్లు కొనండి.. భార్యను ఫ్రీగా పట్టేయండి అని ప్రకటన ఇచ్చింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువులను ప్రజల వద్దకు చేర్చడానికి లేదా తమ ఉత్పత్తులను జనం వినియోగించాలన్నా వారి దృష్టిని ఆకర్షించాలి. ఇందుకోసం వ్యాపారస్తులు తమ వస్తు ఉత్పత్తుల పై లుక్ పడాలన్నా.. సేల్స్ పెరగాలన్నా భిన్నమైన పద్దతిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ప్రకటనలు ఇవ్వడమే కాదు.. ఒకటి కొనే ఒకటి ఫ్రీ అని.. లేదా లక్కీ డ్రా తీస్తే వస్తువులు బంపర్ బహుమతులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను గిఫ్ట్ అంటూ రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆ ఆఫర్ విని షాక్ తింటున్నారు కూడా.. డ్రాగన్ కంట్రీలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ వద్ద ఇల్లు కొనండి.. భార్యను ఫ్రీగా పట్టేయండి అని ప్రకటన ఇచ్చింది.
చైనా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందనే వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలపై ప్రభావం చూపించినా.. రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయి దిగజారడంతో ఇల్లు కొనాలనుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఈ క్రమంలో టియాంజన్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తమ వెంచర్‌లో ఇళ్లను అమ్మెందుకు కస్టమర్డ్స్ ను ఆకట్టుకునేందుకు ఓ ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రకటన వివాదాస్పదనగా మారింది. తమ వెంచర్‌లో ఇళ్లు ఖరీదు చేస్తే వారికి భార్యను ఫ్రీగా ఇస్తామని యాడ్ ఇచ్చింది. ఈ ప్రకటన టీవీలు, సోషల్ మీడియాలో, వాల్ పోస్టర్లపై కనిపించేలా అన్ని చర్యలు సదరు కంపెనీ తీసుకుంది. ఈ ప్రకటన చూసిన ఇల్లు కొంటే భార్యను ఎలా ఉచితంగా ఇస్తారు అంటూ మండిపడుతున్నారు.
ఈ యాడ్ పై ప్రజలు మాత్రమే కాదు చైనా ప్రభుత్వ అథారిటీ సంస్థ సీరియస్ అయింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ. 3 లక్షల జరిమానా విధించింది.
అయితే ఈ యాడ్ ను సరిగ్గా అర్ధం చేసుకోలేదని.. తమ వెంచర్ లో ఇల్లు కొనండి.. మీ భార్యకు ఇవ్వండి అని ఉందని అంటున్నారు. కాగా బెజియంగ్ ప్రావిన్స్‌కు చెందిన మరో రియల్ ఎస్టేట్ సంస్థ ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఫ్రీగా ఇస్తామని యాడ్ ఇచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..