AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: యువతి పట్ల మహిళా పోలీసుల దురుసు ప్రవర్తన.. ఘటనపై విచారణ జరుపుతున్నామన్న సైబరాబాద్ కమిషనర్

వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతి యుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల నాయకుల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడం విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ABVP ఉద్యమాలు చేస్తోంది.

Hyderabad: యువతి పట్ల మహిళా పోలీసుల దురుసు ప్రవర్తన.. ఘటనపై విచారణ జరుపుతున్నామన్న సైబరాబాద్ కమిషనర్
Telangana News
Noor Mohammed Shaik
| Edited By: TV9 Telugu|

Updated on: May 10, 2024 | 5:24 PM

Share

మహిళా పోలీసులు స్కూటీపై వెళ్తూ ఓ యువతి జుట్టు లాగుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కల్వకుంట్ల కవిత ప్రభుత్వం తీరు, పోలీసుల తీరు సరికాదంటూ దీనిపై స్పందించాలని మానవ హక్కుల సంఘాన్ని కోరారు. అయితే ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని సైబరాబాద్ కమిషనర్ చెప్పారు. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతి యుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల నాయకుల పై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడం విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ABVP ఉద్యమాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో.. ఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ  మాట్లాడుతూ వ్యవసాయ ,ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దని జయశంకర్ స్టేట్ యూనివర్సిటీలో ఏబీవీపీ నిరసన చేసినట్లు వెల్లడించారు. అగ్రికల్చర్ వర్సిటీ ద్వారా రాష్ట్రంలో  వ్యవసాయ రంగానికి మేలు చేయకూర్చాలని పేర్కొన్నారు. అంతేకాదు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చాలి.. రైతులకు నష్టం రాకుండా..పండించే ప్రతి పంట లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను సృష్టించాలని.. అందుకు అనుగుణంగా పరిశోధన చేపట్టిలని .. రైతుల  అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన వర్సిటీ. గత 35 సంవత్సరాలుగా రాష్ట్రంలో రైతులను, రైతాంగాన్ని పటిష్టం చేయడానికి ఎనలేని కృషి చేస్తున్న ఈ యూనివర్సిటీలోని స్థలం హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం సరికాదని చెబుతున్నారు.

నేడు అగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన భవనాలను కట్టడానికి జీవో నెంబర్ 55 ను తీసుకుని వచ్చి.. యూనివర్సిటీలో దాదాపుగా 100 ఎకరాల భూమిని తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే హైకోర్టు బిల్డింగ్ ను ఈ ప్రాంగణంలో కట్టొద్దని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని ఆరోపిస్తుంది. అంతేకాదు గ్రామీణ విద్యార్థులు విద్యను దూరం చేసి పరిశోధనలు జరగకుండా చేసేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ తెలుపుతుంది.

ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కార్యచరణ రూపొందించి అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. యూనివర్సిటీలో గుంట భూమిని కూడా వదలమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ABVP హెచ్చరిస్తుంది. యూనివర్సిటీ భూములను చూడడానికి వెళుతున్నటువంటి విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిని విద్యార్థి నాయకులు తీవ్రంగా ఖండించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..