AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్మగ్లర్ల రూట్ మ్యాప్‌లో వూహించని ట్విస్ట్.. అదే కొంపముంచింది! కట్‌చేస్తే కటకటాల్లోకి…

మహబూబాబాద్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఆంధ్ర - ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు AP16DP 1148 నెంబర్ గల కారులో హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నారు. హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారనే అనుమానంతో అడ్డదారిలో వెళ్తున్నారు.. ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా..

Telangana: స్మగ్లర్ల రూట్ మ్యాప్‌లో వూహించని ట్విస్ట్.. అదే కొంపముంచింది! కట్‌చేస్తే కటకటాల్లోకి...
Ganja Smuggling Gang Arrest
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 25, 2024 | 10:01 AM

Share

మహబూబాబాద్, జనవరి 25: మహబూబాబాద్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఆంధ్ర – ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు AP16DP 1148 నెంబర్ గల కారులో హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నారు. హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారనే అనుమానంతో అడ్డదారిలో వెళ్తున్నారు.. ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్ల కారు ఎక్సైజ్ సిబ్బందిని చూడగానే పరుగులు పెట్టింది.. అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నించారు.. కానీ వాళ్ల తలరాత బాగలేక దొరికిపోయారు..

కారు ఎస్కేప్ అవుతుండగా గమనించిన ఎక్సైజ్ టాస్ప్‌ ఫోర్స్ సిబ్బంది ఆ కారులో ఏదో ఉందని వెంబడించారు… చేజ్ చేసే క్రమంలో గంజాయితో ఉన్న కారు బోల్తా కొట్టింది.. ఇంకేముంది కథ అడ్డం తిరిగింది.. రూట్ మ్యాప్ లో వూహించని చేంజ్.. ఆ కారు డిక్కీ ఓపెన్ చేసిన ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిబ్బంది అవాక్కయ్యారు.. అందులో కట్టల కట్టలుగంజాయి ప్యాకెట్స్ చూసి షాక్ అయ్యారు. 200 కిలోల ఎందు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.40 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల విక్రయాలు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ ముఠా ఎక్కడనుండి గంజాయి తరలిస్తున్నారు..! ఎక్కడ విక్రయాలు జరుపుతున్నారు.! ఇక్కడి నుండి ఎక్కడెక్కడికి గంజాయి తరలిస్తున్నారు అనే కోణంలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది మరిన్ని వివారాలు కుపీ లాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us