AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టార్గెట్ ఫిక్స్.! లక్ష్యం దిశగా కాంగ్రెస్ పావులు.. నేడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ క్షేత్రస్థాయి మీటింగ్..

తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల నగారా మోగకముందే పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది హస్తం పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయడమే ఈ మీటింగ్ అజెండా.

టార్గెట్ ఫిక్స్.! లక్ష్యం దిశగా కాంగ్రెస్ పావులు.. నేడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ క్షేత్రస్థాయి మీటింగ్..
Cm Revanth Kharge
Ravi Kiran
|

Updated on: Jan 25, 2024 | 9:00 AM

Share

తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల నగారా మోగకముందే పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది హస్తం పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయడమే ఈ మీటింగ్ అజెండా.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త బూత్ లెవెల్ ఏజెంట్లతో ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ మీటింగ్‌కి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. బూత్ లెవెల్ ఏజెంట్లంతా ఈ మీటింగ్‌కి హాజరు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీనియర్ నాయకులు పాల్గొంటారు. బూత్ కన్వీనర్లు, నాయకులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 36వేల మంది బూత్ స్థాయి కన్వీనర్లు సమావేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది హస్తం పార్టీ.

అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఎజెంట్లే క్రియాశీలకంగా పనిచేశారు. గ్రౌండ్ లెవల్‌లో శ్రమించి.. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న హస్తం పార్టీ.. బూత్ లెవెల్ ఏజెంట్లను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు.

ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?