China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 39 మంది మృతి.. తొమ్మిది మందికి గాయాలు
చైనా డైలీ మీడియా ఔట్‌లెట్ ప్రకారం యుషుయ్ జిల్లాలోని టియాంగాంగ్నాన్ అవెన్యూలోని ఒక దుకాణంలోని భూగర్భ అంతస్తులో మధ్యాహ్నం మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక ప్రతిస్పందన అత్యవసర ప్రధాన కార్యాలయం తెలిపింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
చైనాలో గత ఏడాది నుంచి తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాలను మరచిపోకముందే.. తాజాగా జియాంగ్జీ ప్రావిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిన్యు నగరంలోని ఒక దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 39 మంది మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని చైనా ప్రభుత్వ మీడియా, స్థానిక ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు కొంతమంది ఇప్పటికీ దుకాణంలో చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
చైనా డైలీ మీడియా ఔట్‌లెట్ ప్రకారం యుషుయ్ జిల్లాలోని టియాంగాంగ్నాన్ అవెన్యూలోని ఒక దుకాణంలోని భూగర్భ అంతస్తులో మధ్యాహ్నం మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక ప్రతిస్పందన అత్యవసర ప్రధాన కార్యాలయం తెలిపింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
దుకాణం నుంచి భారీగా పొగలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ షేర్ చేశారు. స్ట్రీట్ లో ఉన్న దుకాణాల నుండి దట్టమైన, నల్లటి పొగలు వెలువడుతున్నాయి. ఇవి సమీపంలోని భవనాలను చుట్టుముడుతున్నట్లు చూపిస్తున్నాయి. స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CCTV న్యూస్ ప్రకారం.. మంటలు చెలరేగిన భవనంలో నేలమాళిగలో ఇంటర్నెట్ కేఫ్పై.. అంతస్తులో శిక్షణా సంస్థ ఉందని తెలుస్తోంది.
తరచుగా ప్రమాదాలు
దేశంలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రమాదాలను నివారించడానికి, ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది చైనాలో అనేక అగ్నిప్రమాదాలు సంభవించాన్న సంగతి తెల్సిందే. ఈ ఏడాది గత వారం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది విద్యార్థులు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..