Viral News: అరుదైన వ్యాధితో మరణించిన 15 నెలల కుమార్తె.. రాళ్లుగా మార్చి జ్ఞాపకాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు

అరుదైన జన్యుపరమైన రుగ్మత కారణంగా అమెరికాకు చెందిన దంపతులు తమ కుమార్తెను కోల్పోయారు. చిన్నారి వయస్సు 15 నెలలు. కుమార్తె మరణంతో బాధపడ్డ ఈ జంట తమ కూతురు జ్ఞాపకాలను పదిల పరుచుకోవాలని కోరుకున్నారు. అందుకు అరుదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమ చిన్నారి తనయని రాయిగా మార్చారు. అను నిత్యం ఆ రాళ్లను చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు  

Viral News: అరుదైన వ్యాధితో మరణించిన 15 నెలల కుమార్తె.. రాళ్లుగా మార్చి జ్ఞాపకాలను పదిలం చేసుకున్న తల్లిదండ్రులు
Poppy Turns Stones
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2024 | 4:58 PM

అమెరికాలోని ఇడాహోలో నివసిస్తున్న కైలీ, జేక్ మాస్సే దంపతుల కుమారై 15 నెలల పాపీ. అయితే TBCD అనే జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి గత ఏడాది ఏప్రిల్‌లో మరణించింది. పాపీకి 9 నెలల వయసులో ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే పాపి తల్లి కైలీ మాట్లాడుతూ.. తన కూతురు పుట్టినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని చెప్పారు.

కుమార్తె ఆరోగ్య పరిస్థితి తెలియని తల్లిదండ్రులు

కైలీ , జేక్‌లకు పాపీ పరిస్థితి గురించి తెలియదు. చిన్నారికి 4 నెలల వయస్సు వచ్చినప్పుడు.. దృష్టి సరిగ్గా అభివృద్ధి చెందడం లేదని గమనించారు. ఆ తర్వాత వారు చాలా మంది వైద్యులను సంప్రదించారు. అయితే పాపి పరిస్థితి ఏమిటో తెలియలేదు. దీంతో వైద్యులు పాపీకి MRI స్కాన్ చేయించమని సలహా ఇచ్చారు.

TBCD వ్యాధితో బాధపడుతున్న ప్రపంచంలో 38వ అమ్మాయి

ఎంఆర్‌ఐ రిపోర్టు వచ్చిన తర్వాత వైద్యులు షాక్ తిన్నారు. చిన్నారి మెదడు మధ్య భాగం కార్పస్ కాలోసమ్ సరిగా అభివృద్ధి చెందలేదని కనుగొన్నారు. 5 నెలల వయస్సులో పాపి TBCD అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచంలో ఈ వ్యాధితో బాధపడుతున్న 38వ చిన్నారి. పాపీ మరణానికి కొంతకాలం ముందు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడింది. దీంతో అప్పుడు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పాపీ న్యుమోనియా బారిన పడినట్లు చెప్పారు. అంతేకాదు పాపీకి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఇవి కూడా చదవండి

ఐసీయూలో చేర్చిన కొన్ని గంటలకే మరణం

ఆసుపత్రిలో చేరిన పాపీని సంరక్షణ కోసం ఐసియుకి షిఫ్ట్ చేశారు. తరువాత చిన్నారి పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో పాపి .. అక్క అన్నలు తుది వీడ్కోలు చెప్పారు. పాపి 5 గంటల తర్వాత మరణించింది. మరణానంతరం కైలీ, జేక్ పాపీ గుర్తుగా చితాభస్మాన్ని తమ ఇంట్లోనే ఉండాలని కోరుకున్నారు.

బూడిదతో అందమైన రాళ్లు

బూడిదతో అందమైన రాళ్లను కూడా తయారు చేయవచ్చని పాపి తల్లిదండ్రులు తెలుసుకున్నారు. దీంతో తయారీ దారులను సంప్రదించారు. పాపీ మరణించిన కొన్ని నెలల తర్వాత.. ఆ కుటుంబానికి చేతితో వ్రాసిన నోట్ తో పాటు “అందమైన పెట్టె” లభించింది. పార్టింగ్ స్టోన్ బాక్స్‌తో దొరికిన నోట్‌లో ‘మీ కుమార్తెను మాకు అప్పగించినందుకు ధన్యవాదాలు’ అని రాసి ఉంది.

ఈ పెట్టెలో 13-14 తెల్లని రంగు రాళ్ళు ఉన్నాయి. అవి చాలా అందంగా, చిన్నవిగా ఉన్నాయి. కైలీ, జేక్ ఈ రాళ్లను పాపి ఊయల లో ఉంచారు. వీటిని చూస్తుంటే తమ కుమార్తె ఇంట్లో ఎప్పుడూ ఉన్నట్లు అనిపిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..