Viral News: ప్రపంచంలో అత్యంత లక్కీ పర్సన్ ఇతనే.. 7 సార్లు మరణాన్ని ఓడించి, 5 కోట్లు లాటరీ గెలుచుకున్నాడు

ఫ్రాన్ సెలక్ ఏ ఆసుపత్రిలోనో, ఇంట్లోనో కాకుండా పడవలో పుట్టాడట. గర్భవతి అయిన ఫ్రాన్ తల్లి తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళింది. అప్పుడు పడవలో ఫ్రాన్ సెలక్ జన్మించాడు. అయితే అతను పుట్టే సమయంలో చాలా బలహీనంగా ఉన్నాడట.. వైద్యులు పరీక్షించి ఎక్కువ కాలం జీవించడని చెప్పారు. అయితే ఫ్రాన్ తల్లి ఏ వైద్యుడి మాటలను నమ్మలేదు. తన బిడ్డ సంరక్షణ కోసం తనను తాను అంకితం చేసుకుంది. దీంతో ఫ్రాన్ సెలక్ హెల్త్ మెరుగుపడింది.

Viral News: ప్రపంచంలో అత్యంత లక్కీ పర్సన్ ఇతనే.. 7 సార్లు మరణాన్ని ఓడించి, 5 కోట్లు లాటరీ గెలుచుకున్నాడు
WORLD’S LUCKIEST UNLUCKY MAN
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2024 | 12:59 PM

ఒక వ్యక్తికి ప్రమాదం జరిగి.. అతను దాని నుండి తప్పించుకుంటే.. మనం అతన్ని అదృష్టవంతుడు అంటాము. అదే సమయంలో ఒక వ్యక్తి 7 సార్లు మరణం అంచుకు వెళ్లి అతనికి ఏమీ జరగకపోతే అతన్ని మనం ఏమని పిలుస్తాము మృత్యుంజయుడు అని పిలవలేమో.. 1929లో యుగోస్లేవియాలో జన్మించిన ఫ్రాన్ సెలక్ అనే వ్యక్తి ఇందుకు ఉదాహరణగా నిలుస్తాడు. ఫ్రాన్ సెలక్ పుట్టిన క్షణం నుండి అతని జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్ సెలక్ ఏ ఆసుపత్రిలోనో, ఇంట్లోనో కాకుండా పడవలో పుట్టాడట. గర్భవతి అయిన ఫ్రాన్ తల్లి తన తండ్రితో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళింది. అప్పుడు పడవలో ఫ్రాన్ సెలక్ జన్మించాడు. అయితే అతను పుట్టే సమయంలో చాలా బలహీనంగా ఉన్నాడట.. వైద్యులు పరీక్షించి ఎక్కువ కాలం జీవించడని చెప్పారు. అయితే ఫ్రాన్ తల్లి ఏ వైద్యుడి మాటలను నమ్మలేదు. తన బిడ్డ సంరక్షణ కోసం తనను తాను అంకితం చేసుకుంది. దీంతో ఫ్రాన్ సెలక్ హెల్త్ మెరుగుపడింది.

నాలుగుసార్లు వివాహం చేసుకున్న ఫ్రాన్ సెలక్

ఫ్రాన్ సెలాక్ తల్లి ఇంట్లో తన కుమారుడికి విద్యను అందించాలని నిర్ణయించుకుంది. దీంతో అతనికి సంగీత పాఠాలు కూడా చెప్పడం ప్రారంభించింది. ఫ్రాన్ సంగీతంలో వృత్తిని ఎందుకున్నాడు.. పెద్దయ్యాక తన ఇంటికి సమీపంలోని పాఠశాలలో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేయడం ప్రారంభించాడు. ఇలా చాలా సంవత్సరాలు సంగీత టీచర్ గా పనిచేశాడు. అయితే అతని వైవాహిక జీవితం సరిగ్గా లేదు. నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడు. ఆ నాలుగు భార్యల్లో ఒక భార్య నేపధ్యం భారత్ కు సంబంధించింది.

ఇవి కూడా చదవండి

30 ఏళ్ల తర్వాత మారిన జీవితం

30 ఏళ్ల తర్వాత ఫ్రాన్ సెలక్ జీవితం మారడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత అదృష్ట వ్యక్తిగా నిలిచాడు. 1962లో ఫ్రాన్ తన స్వస్థలం నుండి మరొక నగరమైన డుబ్రోవ్నిక్‌కి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, అది పట్టాలు తప్పింది. రైలు ప్రయాణిస్తున్న సమయంలో నది మీద ఉన్న వంతెన విరిగిపోవడంతో రైలు నీటిలో పడిపోయింది. ఆ సమయం శీతాకాలం కావడంతో నదిలో నీరు గడ్డకట్టినట్లు చల్లాగా ఉన్నాయి. ఈ రైలు ప్రమాదంలో చాలా మంది మరణించారు. అయితే ఫ్రాన్‌కు చేయి విరిగింది. అయితే ఫ్రాన్ సెలాక్ అతి కష్టం మీద నదిని ఈదుతూ బయటకు వచ్చాడు.

విమాన ప్రమాదం

రైలు ప్రమాదం నుండి ఫ్రాన్ సెలాక్ ఇంకా కోలుకోలేదు.. ఒక సంవత్సరం తరువాత 1963లో తన తల్లిని కలవడానికి ఫ్లైట్ ఎక్కినప్పుడు.. విమానం ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుంది. దీని కారణంగా, బలమైన గాలి విమానంలోకి ప్రవేశించడం ప్రారంభించింది .. విమానం బ్యాలెన్స్ దెబ్బతింది. తర్వాత అది కింద పడటం ప్రారంభించింది. ఈ విమాన ప్రమాదంలో సుమారు 19 మంది మరణించారు. అయితే ఫ్రాన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అతనికి మెలకువ వచ్చినప్పుడు తాను ఆసుపత్రిలో ఉన్నట్లు గుర్తించాడు. రెస్క్యూ టీమ్ అతనికి స్పృహ కోల్పోయి, ఎండుగడ్డి కుప్పలో పడి ఉన్నాడని చెప్పారు.

బస్సు ప్రమాదం

ఫ్రాన్ సెలాక్ రెండు సంఘటనలను ప్రమాదంగా భావించి మరచిపోయి తన సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. అయితే అదృష్టం అతనితో ఆడుకుంటూనే ఉంది. మూడేళ్ల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లడానికి బస్సులో బయలుదేరాడు. అక్కడ ఫ్రాన్ సెలాక్ తన బృందంతో సహా సంగీతానికి అవార్డును అందుకోవలసి ఉంది. అయితే కొండ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఈసారి కూడా ఫ్రాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతను తన సూట్‌కేస్‌తో బస్సు నుండి బయటకు వచ్చి తన ప్రయాణం ప్రారంభించాడు.

నాలుగేళ్లలో మూడుసార్లు మృత్యువును ఓడించిన ఫ్రాన్ సెలాక్

4 సంవత్సరాలలో ఫ్రాన్ మూడుసార్లు మరణాన్ని ఓడించాడు. అతని అదృష్టం అతన్ని పరీక్షిస్తూనే ఉంది. 1970లో మరోసారి అతను తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఎక్కడికో వెళ్లేందుకు తన కారును బయటకు తీశాడు. కొద్దిదూరం వెళ్లగానే ఏదో కాలిపోతున్న వాసన వచ్చింది. ఫ్రాన్‌కి ఏమీ అర్థం కాకముందే.. అతని కారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడం మొదలయ్యాయి. వెంటనే కారు బ్రేకులు వేసి కిందకు దిగి ప్రాణాలను రక్షించుకున్నాడు.

మరోసారి ఫ్రాన్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఒక రోజు అతను సమీపంలోని పెట్రోల్ పంపులో ఆయిల్ నింపుతున్నారు.. అయితే కారులో మంటలు వ్యాపించాయి. ఇది చూసిన ఫ్రాన్ కారు నుండి దూరంగా పరిగెత్తాడు. అనంతరం అక్కడ భారీ పేలుడు సంభవించింది. అయితే ఈసారి ఫ్రాన్ సెలాక్ దుస్తులు, తలపై వెంట్రుకలు కాలిపోయాయి.

డబుల్ డెక్కర్ బస్సు

దీని తరువాత సుమారు 22 సంవత్సరాలు శాంతియుతంగా గడిచాయి. ఫ్రాన్ కూడా తన చెడు కాలం ముగిసినట్లు భావించాడు. అయితే 1995 లో పనికి వెళుతున్నప్పుడు అతని ఎదురుగా వస్తున్న డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురయ్యాడు. ఫ్రాన్ ఈ ప్రమాదం నుండి బయటపడలేడని భావించారు.. ఎందుకంటే బస్సు అతన్ని చాలా దూరం విసిరివేసింది. కానీ ఈసారి కూడా ఫ్రాన్ సెలాక్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి ఏమీ జరగలేదు.

ఒక సంవత్సరం తరువాత 1996లో ఫ్రాన్ కారులో పర్వతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ముందు నుండి వస్తున్న ట్రక్కును తప్పించడానికి తన కారును ఎడమవైపుకు తిప్పాడు. దీని కారణంగా అతని కారు కొండపై ఇరుక్కుపోయింది. తన కారు వెనుక డోర్ నుండి బయటకు వచ్చిన వెంటనే కారు పర్వతం నుండి పడిపోయింది. తర్వాత అది పేలిపోయింది.

ప్రతిఫలం దక్కింది

జీవితంలో చాలా ఆపదలను ఎదుర్కొన్న తర్వాత.. ఫ్రాన్ కు విధి మంచి బహుమతినిచ్చింది. 2002లో ఒక కిరాణా దుకాణంలో షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని నాణేలతో లాటరీ టికెట్ కొన్నాడు. తన జీవితంలో మొదటిసారి లాటరీని కొనుగోలు చేసిన ఫ్రాన్ కు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఫ్రాన్ సెలాక్ కు బహుమతిగా 600,000 డాలర్లు (సుమారు 5 కోట్లు) గెలుచుకున్నాడు.

ఆ డబ్బుతో విలాసవంతమైన ఇల్లు కొనుక్కొని కారు కూడా కొన్నాడు. కొన్నాళ్లు విలాసవంతమైన జీవితం గడిపిన అతను మళ్లీ పాత జీవితంలోకి రావాలని నిర్ణయించుకుని తన ఇంటిని అమ్మి ఆ డబ్బును బంధువులకు పంచాడు. అయితే, దీని తరువాత, ఫ్రాన్ 30 నవంబర్ 2016 న 87 సంవత్సరాల వయస్సులో సహజంగా మరణించాడు.

మరిన్ని ట్రేండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?