గిరిజన సహకార సంస్థ సారధ్యంలో అరకు కాఫీ.. జాతీయ స్థాయి ఒక జిల్లా, ఒక ఉత్పత్తి ( One District One Product- ODOP)2023అవార్డుకు ప్రధమ స్థానంలో నిలిచింది. అవార్డును సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వేడుకలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు జిసిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అరకు కాఫీకి విశిష్ట గుర్తింపు ఇచ్చిన అధికారులకు, అల్లూరి జిల్లాలోని అరకు, చింతపల్లి ప్రాంతాల గిరిజన కాఫీ రైతులకు కృతజ్ఞతలు తెలియజేసారు ఎం డీ. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ తీసుకురావడంలో సహకరిస్తున్న గిరిజన రైతులు, జిసిసి సిబ్బంది సహకారం, కృషి అభినందనీయమని అన్నారు.