- Telugu News Photo Gallery Amazing Health Benefits of Moringa Leaves, check here is details in Telugu
Moringa Leaves Benefits: పోషకాల నిధి ‘మునగాకు’.. ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో!
మునక్కాయలు, మునకాగులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. పలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా అదుపు చేసే గుణం మునగాకుల్లో ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కి మునగాకు ఇవ్వడం వల్ల ఎంతో మంచిది. మునగాకు ఆసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా పండుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల డయాబెటీస్, రక్త పోటు, కీళ్ల నొప్పులు, వైరల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి ఉపశమనం పొందొచ్చు. క్రమం తప్పకుండా మునగాకు కానీ, మునక్కాయలను కానీ..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Jan 04, 2024 | 6:26 PM

మునక్కాయలు, మునకాగులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. పలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా అదుపు చేసే గుణం మునగాకుల్లో ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కి మునగాకు ఇవ్వడం వల్ల ఎంతో మంచిది. మునగాకు ఆసియా, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా పండుతుంది.

దీన్ని తీసుకోవడం వల్ల డయాబెటీస్, రక్త పోటు, కీళ్ల నొప్పులు, వైరల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి ఉపశమనం పొందొచ్చు. క్రమం తప్పకుండా మునగాకు కానీ, మునక్కాయలను కానీ తీసుకుంటే పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మునగాకులో అధికంగా విటమిన్ సి, ఏ, ఇలతో పాటు పొటాషియం, ఐరన్ వంటి ఇతర పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు మునగాకుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.

మునగాకు లేదా మునక్కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదే విధంగా ఆకలి సమస్యలు కూడా తీరుతాయని వెల్లడించారు. అధిక బరువు ఉన్నవారు మునగాకు తీసుకుంటే.. సన్నగా అవ్వొచ్చు.

మునగాకు తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కూడా తొలగించడంలో సహాయ పడుతుంది. మునగాకు నీటిలో మరిగించి.. ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.





























