AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకీ హైప్ పెరుగుతుంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 5:10 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న తెచ్చుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, సినిమా పై అంచనాలను తార స్థాయికి చేర్చాయి. దాంతో ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే చరణ్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగే చరణ్ చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ బ్యూటీస్ తోనూ నటించి హిట్స్ అందుకున్నాడు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ కు లవర్ గా , తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒకే ఒక్క హీరోయిన్ చరణ్ కు భార్యగా, తల్లిగా నటించి మెప్పించింది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అంజలి. శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి నటించింది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. తండ్రి కొడుకుల పాత్రలో చరణ్ రాణించగా.. తండ్రి పాత్రలో నటించిన చరణ్ కు జోడీగా అంజలి నటించింది. దాంతో కొడుకుపాత్రలో నటించిన చరణ్ కు తల్లిగా కనిపించింది.

ఇక అంజలి హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గానూ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది అంజలి. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. తాజాగా ఉత్తమ సహాయకనటిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు గాను ఫిలిం ఫేర్ అవార్డును అందుకుంది అంజలి.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us