AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs AUS W : స్మృతి మంధాన, హర్మన్ పోరాటం వృధా..ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా

IND W vs AUS W : బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు నిరాశ ఎదురైంది. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ.. భారత బౌలర్లు ఆసీస్ జోరును అడ్డుకోలేకపోయారు.

IND W vs AUS W : స్మృతి మంధాన, హర్మన్ పోరాటం వృధా..ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా
India Women Vs Australia Women
Rakesh
|

Updated on: Feb 24, 2026 | 4:39 PM

Share

IND W vs AUS W : బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు నిరాశ ఎదురైంది. స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ.. భారత బౌలర్లు ఆసీస్ జోరును అడ్డుకోలేకపోయారు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటీవల టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళలకు ఈ ఓటమి గట్టి షాక్ ఇచ్చింది.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే జట్టు స్కోరు సున్నా వద్దే ఓపెనర్ ప్రతిక రావల్ అవుట్ అవ్వడంతో భారత్ షాక్‌కు గురైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే షెఫాలీ వర్మ (4), జెమిమా రోడ్రిగ్స్ (8) కూడా పెవిలియన్ చేరారు. కేవలం 52 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును స్మృతి మంధాన (58), హర్మన్‌ప్రీత్ కౌర్ (53) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మంధాన అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. చివర్లో కాశ్వి గౌతమ్ (43) మెరుపులు మెరిపించడంతో భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.

215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలిస్సా హీలీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. హీలీ (50) హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత వచ్చిన బెత్ మూనీ (76) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. అన్నబెల్ సదర్లాండ్ ఆఖర్లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో ఆసీస్ మరో 70 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో ఎన్.ఆర్. శ్రీ చరణి 2 వికెట్లు తీయగా, క్రాంతి గౌడ్ ఒక వికెట్ పడగొట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త.
వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
వందల సినిమాల్లో విలన్‌గా చేసిన ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?