AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్డు.. అద్భుతమైన కార్డ్‌ వీడియోపై ఓ లుక్ వేయండి

జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి తర్వాత  రోజు నుంచి గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న సరయూ నది నీటితో రామ మందిర శుద్ధి కార్యక్రమం మొదలు 22 వ తేదీ మధ్యాహ్నం బాల రామ విగ్రహ ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 6,000 ఆహ్వాన కార్డులు ముఖ్య వ్యక్తులకు పంపించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదియానాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరుకానున్నారు.

Ayodhya: రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్డు.. అద్భుతమైన కార్డ్‌ వీడియోపై ఓ లుక్ వేయండి
Ram Mandir Invitation Card
Surya Kala
|

Updated on: Jan 04, 2024 | 12:26 PM

Share

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ శుభ సమయం మరి కొన్ని రోజుల్లో జరుపుకోనుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు శుభ ముహూర్తంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. జనవరి 24వ తేదీ నుంచి భక్తులను బాల రామయ్య దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం.. ప్రతి డొమైన్‌లో దేశ గౌరవానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తులతో పాటు అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులకు ఆహ్వానాలను పంపించారు.

ఇప్పుడు ఈ ఆహ్వాన కార్డుకు సంబంధించిన వీడియోను X (గతంలో ట్విట్టర్)లో జాతీయ ప్రసార కర్తగా దూరదర్శన్ ను భాగస్వామ్యం చేసారు. కార్డ్‌లోని మొదటి పేజీలో “న్యూ గ్రాండ్ టెంపుల్ హోమ్‌లో రామ్ లల్లా తన జన్మ స్థానంలో తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక” అని పేర్కొంటూనే.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన కాలక్రమం, దశల గురించి వివరాలను ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆహ్వాన కార్డును ఇక్కడ చూడండి

జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి తర్వాత  రోజు నుంచి గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న సరయూ నది నీటితో రామ మందిర శుద్ధి కార్యక్రమం మొదలు 22 వ తేదీ మధ్యాహ్నం బాల రామ విగ్రహ ప్రతిష్టను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 6,000 ఆహ్వాన కార్డులు ముఖ్య వ్యక్తులకు పంపించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదియానాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరుకానున్నారు. ఆహ్వానం అందుకున్న ముఖ్య వ్యక్తుల్లో సినీ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి, పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..