AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య రామయ్య భక్తులకు ఏలకుల ప్రసాదం.. ఈ నెల 22లోపు సిద్ధంకానున్న 5లక్షల ప్యాకెట్లు..

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించాలంటే.. ప్రసాదం సమృద్ధిగా ఉండటం చాలా ముఖ్యం.  ఇప్పటికే ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని ట్రస్ట్ బృందం వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం.. రామాలయంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వచ్చే భక్తులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని సిద్ధం చేసే బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్‌కు అప్పగించారు. ఈ కంపెనీకి ప్రసాదం తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు.

Ayodhya: అయోధ్య రామయ్య భక్తులకు ఏలకుల ప్రసాదం.. ఈ నెల 22లోపు సిద్ధంకానున్న 5లక్షల ప్యాకెట్లు..
Ayodhya Cardamom Prasad
Surya Kala
|

Updated on: Jan 04, 2024 | 11:27 AM

Share

అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొనడానికి రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలువురు సెలబ్రెటీలు, సాధువులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు యాలకులను అందజేయనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఏలకులు, పంచదార కలిపి ఈ ప్రసాదాన్ని (ఇలాచీదానా) తయారుచేస్తారు. సాధారణంగా దేశంలోని అన్ని దేవాలయాల్లో  ఇలాచీదానా ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నారు.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించాలంటే.. ప్రసాదం సమృద్ధిగా ఉండటం చాలా ముఖ్యం.  ఇప్పటికే ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చామని ట్రస్ట్ బృందం వెల్లడించింది.

ఇలాచీదానా తయారీ బాధ్యతను ఏ సంస్థకు అప్పగించారంటే..

మీడియా కథనాల ప్రకారం.. రామాలయంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వచ్చే భక్తులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని సిద్ధం చేసే బాధ్యతను రామ్ విలాస్ అండ్ సన్స్‌కు అప్పగించారు. ఈ కంపెనీకి ప్రసాదం తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. రామ్ విలాస్ అండ్ సన్స్‌ కు సంబంధించిన వ్యక్తి మిథిలేష్ కుమార్ మాట్లాడుతూ రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇచ్చే ప్రసాదాన్నిఇలాచీదానాని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రసాదం తయారీ పనిలో తమ కంపెనీ నిమగ్నమై ఉందని వెల్లడించారు. ట్రస్టు ఇచ్చిన సూచనల మేరకు రోజూ ప్రసాదం తయారీని చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

5 లక్షల ప్యాకెట్లకు ఆర్డర్

యాలకులను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని కంపెనీ డైరెక్టర్ చంద్ర గుప్తా చెప్పారు.  యలకుల్లో పొటాషియం, మెగ్నీషియం సహా అనేక ఖనిజాలున్నాయి. కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే అనేక దేవాలయాలకు సంబంధించిన వ్యక్తులు తమ దగ్గర ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారని చెప్పారు. ఇది ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు.  కంపెనీకి చెందిన 22 మంది ఉద్యోగులు ఇప్పటికే కర్మాగారంలో 5 లక్షల ప్యాకెట్ల తయారీలో నిరంతరం పని చేస్తున్నారని వెల్లడించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?
యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలు తెలుసా.. ? నరసింహస్వామి..
యాదాద్రి కొండ గుహలో దాగి ఉన్న రహస్యాలు తెలుసా.. ? నరసింహస్వామి..
సినిమా చనిపోయింది.. మహేష్, రాజమౌళి వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
సినిమా చనిపోయింది.. మహేష్, రాజమౌళి వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా! వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్
పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా! వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్
స్కిల్ మీటర్ కామెడీ..మిల్లర్ కన్నా తిలక్ వర్మ పవర్ ఎక్కువట
స్కిల్ మీటర్ కామెడీ..మిల్లర్ కన్నా తిలక్ వర్మ పవర్ ఎక్కువట
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ రాత్రికే ఆ డెడ్ లైన్..
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఈ రాత్రికే ఆ డెడ్ లైన్..