Ayodhya: అంతా రామమయం.. రాముడి దర్శనం కోసం 800 కి.మీ. సైకిల్ యాత్ర.. ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే..

భారీ సంఖ్యలో రామమందిరాన్ని దర్శించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ముంబైకి చెందిన ఇద్దరు యువకులతో కలిసి షబ్నం అయోధ్యకు పాదయాత్రగా వెళ్తున్న సంగతి తెలిసిందే.. కాగా ఇద్దరు యువకులు బాల రామయ్య వేడుకను కనులారా వీక్షించడానికి సైకిల్ మీద బయలుదేరారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నగరానికి చెందిన ఇద్దరు రామభక్తులు జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సైకిల్‌పై అయోధ్యకు బయలుదేరారు. 

Ayodhya: అంతా రామమయం.. రాముడి దర్శనం కోసం 800 కి.మీ. సైకిల్ యాత్ర.. ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే..
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Jan 04, 2024 | 8:30 AM

హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మించిన భూమి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య. గత 500 ఏళ్లుగా కోట్లాది హిందువులు ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చేసింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం, బాల రామయ్య ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనున్న నేపధ్యంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఇప్పటికే సాధువులు, సెలబ్రేటిలకు ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో రామమందిరాన్ని దర్శించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ముంబైకి చెందిన ఇద్దరు యువకులతో కలిసి షబ్నం అయోధ్యకు పాదయాత్రగా వెళ్తున్న సంగతి తెలిసిందే.. కాగా ఇద్దరు యువకులు బాల రామయ్య వేడుకను కనులారా వీక్షించడానికి సైకిల్ మీద బయలుదేరారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నగరానికి చెందిన ఇద్దరు రామభక్తులు జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సైకిల్‌పై అయోధ్యకు బయలుదేరారు.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నగరానికి చెందిన రవి విశ్వకర్మ (30), అభిజిత్ బస్‌ఫూర్ (22) శ్రీరాముని దర్శనం కోసం మంగళవారం మాల్దా నుంచి అయోధ్యకు సైకిల్‌పై బయలుదేరారు. మాల్దా నుండి అయోధ్యకు 800 కిమీ కంటే ఎక్కువ దూరం. వీరిద్దరూ జనవరి 20 నాటికి సైకిల్‌ మీద 800 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు సగటున 30 నుంచి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నారు.

మంగళవారం ఉదయం రవి, అభిజిత్ ఇద్దరూ కలిసి మాల్దాలోని ప్రముఖ మనకమన దేవి ఆలయంలో పూజలు చేసి అయోధ్యకు బయలుదేరారు. బీహార్‌లోని మాల్దా, దల్‌ఖోలా, పూర్నియా, దండభంగా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ల నుంచి జనవరి 20 నాటికి అయోధ్యకు చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

లక్షలాది మంది భక్తుల చిరకాల స్వప్నం రామమందిర స్థాపన ఇప్పుడు నెరవేరుతోంది. ఈ పవిత్ర రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సైకిల్‌పై అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అదే సమయంలో తాము సైకిల్ మీద వెళ్ళే బాటలో మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల్లో అవగాహన కల్పించే పని కూడా చేయబోతున్నామని ఇద్దరు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు