AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ ఐదు రాశులకు చెందిన మహిళలు పరిస్థితులు ఏవైనా.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు..

ఈ ఐదుగురు తరచుగా తమను తాము వ్యక్తీకరించడంలో నిర్భయతను ప్రదర్శిస్తారు. అంతేకాదు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిజాన్ని మాట్లాడతారు.. ఎదుటివారు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. నిజం మాట్లాడటానికి ఇతరులను ప్రోత్సహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం  వైవిధ్యమైన రంగంలో కొన్ని రాశులకు చెందిన వారి స్వభావం నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. వీటిలో ఈ ఐదు రాశులకు చెందిన మహిళలు తమను తాము సామర్ధ్యం కలిగిన వ్యక్తులుగా భావిస్తారు. నమ్మకం, విశ్వసనీయతని వ్యక్తపరుస్తూ, భయం లేకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

Astro Tips: ఈ ఐదు రాశులకు చెందిన మహిళలు పరిస్థితులు ఏవైనా.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు..
Astro Tips
Surya Kala
|

Updated on: Jan 04, 2024 | 7:01 AM

Share

జ్యోతిష్యశాస్త్రం మనిషి వ్యక్తిత్వ లక్షణాల గురించి తెలిజేస్తుందని.. రాశుల్లో గ్రహాల గమనం బట్టి వ్యక్తి వ్యక్తి గత లక్షణాలు విస్తృతంగా మారవచ్చని పేర్కొంది. అధిక కోపం, తెలివి తేటలు, కష్టపడే తత్వం, నిర్భయత్వం  ఇలా ప్రతి లక్షణాన్ని వెల్లడిస్తుంది. ఈ ఐదుగురు తరచుగా తమను తాము వ్యక్తీకరించడంలో నిర్భయతను ప్రదర్శిస్తారు. అంతేకాదు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిజాన్ని మాట్లాడతారు.. ఎదుటివారు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. నిజం మాట్లాడటానికి ఇతరులను ప్రోత్సహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం  వైవిధ్యమైన రంగంలో కొన్ని రాశులకు చెందిన వారి స్వభావం నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తారు. వీటిలో ఈ ఐదు రాశులకు చెందిన మహిళలు తమను తాము సామర్ధ్యం కలిగిన వ్యక్తులుగా భావిస్తారు. నమ్మకం, విశ్వసనీయతని వ్యక్తపరుస్తూ, భయం లేకుండా మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

మేష రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు వారి సాహసోపేతమైన స్ఫూర్తికి ప్రసిద్ధి చెందారు. నిర్భయంగా తమ మనసులోని మాటను బయటపెడతారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా బాధ్యత వహించడానికి భయపడరు.  మొండితనం, అభిరుచి.. కలిగిన ఈ రాశికి చెందిన స్త్రీలు తమ తమ అభిప్రాయాలను వినిపించడానికి భయపడని సహజ నాయకులను చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు విశ్వాసంతో తేజస్సును కలిగి ఉంటారు. ఈ స్త్రీలు  తమ వ్యక్తిత్వంతో ఇతరులను అయస్కాంతలా ఆకర్షిస్తారు. తమ ఆలోచనలను, భావాలను వ్యక్తీకరించడానికి సిగ్గుపడరు.  అధికారంతో మాట్లాడతారు. కమ్యూనికేషన్ వీరి సొంతం.. తన సహజ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షిస్తారు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి: ఈ  రాశి స్త్రీలు సాహసోపేతమైన, సత్యాన్వేషణ స్వభావానికి ప్రసిద్ధి చెందారు. వీరు  నిర్భయంగా తమ తెలివి తేటలను, విజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. యథాతథ స్థితిని సవాలు చేసినప్పటికీ నిజం మాట్లాడటానికి భయపడరు.  వీరు ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు. కొత్త దృక్కోణాలను నిర్భయంగా అన్వేషించడానికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా వెనుదీయరు.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు నిజాయితీకి ప్రసిద్ధి చెందారు.  భయం లేకుండా మాట్లాడతారు. లోతైన,  అర్ధవంతమైన సంభాషణలను మాట్లాడడానికి ఇష్టపడతారు. తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో,  కష్టమైన అంశాలను పరిష్కరించడంలో తమ సామర్థ్యంతో శక్తివంతమైన వ్యక్తులుగా మారుస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి స్త్రీలు ముందుచూపు, ప్రగతిశీలత కలిగి ఉంటారు. తమ వినూత్న ఆలోచనలు, నమ్మకాలను నిర్భయంగా పంచుకుంటారు. సామాజిక నిబంధనలకు కట్టుబడి ఉండరు. తమ మేధస్సుని,  స్వతంత్ర స్వభావాలని..  నమ్ముతున్న దాని కోసం సంకోచం లేకుండా మాట్లాడటానికి  వెనుదీయరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు