- Telugu News Photo Gallery Spiritual photos Telangana: World’s Rare Sleeping Posture Rahu Rupa (Sarpa Rupa) Dattatreyudu
Shayana Dattatreya: ప్రపంచంలో ఒకే ఒక్క టెంపుల్ సర్పరూప శయన దత్తాత్రేయుడు.. సంతాన లేమితో బాధపడేవారికి ఓ వరం
ఉత్తర తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోయిన్ పల్లి మండలం వరదవెల్లి గ్రామం మిడ్ మానేరు సమీపంలో ఉంది తరచూ ఈ గ్రామం వరదల్లో మునుగుతూ ఉంటుంది కాబట్టి వరదవెల్లి పేరు వచ్చింది అంటారు గ్రామా పెద్దలు..ఈ గ్రామంలో ప్రపంచం లో ఎక్కడ లేని రాహు రూప ఆలయం ఉంది దత్తాత్రేయ స్వామి వరద హస్తములతో వెలిసాడు కాబట్టి వరదవెల్లి అని పేరు వచ్చింది అన్నది మరికొందరి విశ్వాసం..
Sridhar Prasad | Edited By: Surya Kala
Updated on: Jan 02, 2024 | 11:44 AM

ఇక్కడ రాహురూప అంటే సర్ప రూప శయన దత్తాత్రేయుడు ఉండటం ప్రత్యేకత. ఇలాంటి పుణ్య క్షేత్రం ప్రపంచం లో ఎక్కడా లేదు. అప్పట్లో ఈ ఆలయ దర్శనం అయ్యాకే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోడానికి వెళ్లేవారు అని సమాచారం.

అయితే రాను రాను ఈ ఆచారం మరుగున పడిపోయింది. దాదాపు 900 ఏళ్ళ క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గట్టుమీద దాదాపు 12 ఏళ్లపాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశారట.

వెంకావధూత వేంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కుడా. వారి తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారని ఆలయ పురాణం చెప్తుంది

దత్తవెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకావధూత తదుపరి కుడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేసారు. ఆవిధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు.

అవదూత ఒక తపస్సుకు దర్శనమిచ్చిన దత్తాత్రేయుడు వెంకవదూతతో నీకు రాహు మహర్దశ ఉంది ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేను రాహురూపం లోకి మారి శయన సర్ఫుడిగా దర్శనం ఇస్తానని వరం ఇచ్చాడట. ఆలా దత్తాత్రేయుడు రాహురూపం లోకి మారడు అని చెప్తారు.

దత్తాత్రేయుడు రాహు రూపంలో ఉండటం విగ్రహంలో దాగి ఉన్న జంట సర్పాల ఆనవాళ్లు ఫోటో తీస్తే సృష్టాంగా కనిపిస్తాయి

దత్తాత్రేయుడు దత్త వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

ఇక్కడ స్వామి వారిని కోర్టు కేసులు ఉన్నవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, రాహు మహర్దశ ఉన్నవారు, వివాహం కానీ వారు, సంతానం లేని వారు, గొడవలు పడే భార్యాభర్తలు దర్శించి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటాయని నమ్మకం.





























