AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రాములోరిపై భక్తిని చాటుకున్న రైతులు.. పుడమి తల్లి కానుకలుగా బియ్యం, కూరగాయలు తరలింపు..

శ్రీరాముడు సూర్యవంశీయుడు. మనువు, రఘు మహారాజు, సత్యహరిశ్చంద్రుడు, భగరీథుడు, దశరథ మహారాజు.. ఇలా శ్రీరాముడి పూర్వజుల్లో ఎందరో మహానుభావులు. వారిలో ఒకరు  పృథ్వీ మహారాజు, సుపరిపాలనతో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న మనసున్న మారాజు. ఆయన పాలనలో అంతా సస్యశ్యామలం.. సుభిక్షంగా ఉండేదట. భూ మాతకు పృథ్వీ అని పేరు వచ్చింది ఆయన వల్లే.. అంతటి మహారాజు వారసుడు.. మన రామ్‌ లల్లా వేడుక కోసం నేలమ్మ ప్రేమతో అందిస్తోన్న కానుక ఇది. చత్తీస్‌ గఢ్‌ నుంచి  3వందల టన్నుల బియ్యాన్ని తరలించారు.  

Ayodhya: రాములోరిపై భక్తిని చాటుకున్న రైతులు.. పుడమి తల్లి కానుకలుగా బియ్యం, కూరగాయలు తరలింపు..
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Jan 04, 2024 | 7:30 AM

Share
దైవం మానవ రూపంలో అన్న మాటకు చరితార్ధంగా నిలిచాడు శ్రీ రాముడు. కోట్లాది హిందువుల ఆరాధ్యదైవం శ్రీ రాముడు జన్మించిన అయోధ్యలో అపూర్వ వేడుక సందర్భంలో రామయ్యకు అనురాగ కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రకృతి జగతికి  మూలాధారం. రామయ్య వేడుక చేద్దాం..చూద్దాం రారండోయ్‌ అని ఆహ్వానిస్తోంది అయోధ్య. శ్రీ రామరక్షగా విశ్వ వ్యాప్తంగా అక్షితల వితరణ జరుగుతోంది. మరోవైపు  పుడిమి తల్లి కానుకగా  అయోధ్యకు  బియ్యం, కూరగాయాలు ఆహార ధాన్యాల తరలింపు కొనసాగుతోంది. రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి పుడిమి తల్లి  సమర్పిస్తోన్న కానుకే బియ్యం.
 ఇందుకు సంబంధించిన ఆసక్తికర చారిత్రక గాథ వుంది. శ్రీరాముడు సూర్యవంశీయుడు. మనువు, రఘు మహారాజు, సత్యహరిశ్చంద్రుడు, భగరీథుడు, దశరథ మహారాజు.. ఇలా శ్రీరాముడి పూర్వజుల్లో ఎందరో మహానుభావులు. వారిలో ఒకరు  పృథ్వీ మహారాజు, సుపరిపాలనతో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న మనసున్న మారాజు. ఆయన పాలనలో అంతా సస్యశ్యామలం.. సుభిక్షంగా ఉండేదట. భూ మాతకు పృథ్వీ అని పేరు వచ్చింది ఆయన వల్లే.. అంతటి మహారాజు వారసుడు.. మన రామ్‌ లల్లా వేడుక కోసం నేలమ్మ ప్రేమతో అందిస్తోన్న కానుక ఇది. చత్తీస్‌ గఢ్‌ నుంచి  3వందల టన్నుల బియ్యాన్ని తరలించారు.
ఒక చత్తీస్‌గఢ్‌ నుంచి మాత్రమే కాదు. దేశ నలుమూలల నుంచి   అయోధ్యకు బియ్యం, కూరగాయాలు, ఇతర ఆహార ధాన్యాలను భక్తితో భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఐతే చత్తీస్‌ఘడ్‌ నుంచి బియ్యం మాత్రం వెరీ వెరీ స్పెషల్‌. నాణ్యతలో మాత్రమే కాదు అంతకు మించి రామాయణం లాంటి రసరమ్య విశేషం ఉంది మరి.  చత్తీస్‌గడ్‌ నుంచి అయోధ్య బియ్యం పంపడం వెనుక భక్తితో పాటు అంతకు మించిన అనుబంధం ఉంది.
చత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్‌లోని రామాలయం ఎంతో కమనీయంగా రమణీయం. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఎక్కువ సంవ్సరాలు సంచరించింది చత్తీస్‌గఢ్‌ అరణ్యంలోనే. అలనాటి ఆనవాళ్లుగా ఎన్నో విశేషాలు ఇప్పటికీ ప్రాచూర్యంలో వున్నాయి. అంతేకాదు  శ్రీ రాముడి అమ్మమ్మ తాతయ్యలది చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ . మరి మనవడి వేడుక అంటే అమ్మమ్మ వూరికి  మక్కువ ఎలా వుంటదో చెప్పతరమా?.. ఆ అనురాగానికి నిదర్శనమే భక్తితో ఆహార ధాన్యాల తరలింపు.

కూరగాయల సాగు

అయోధ్య రామయ్య కోసం చత్తీస్‌గఢ్‌ రైతులు భక్తి  ప్రేమ అనురాగం కూడా అలాంటివే. ప్రత్యేకంగా ఈ వేడుక కోసమే కూరగాయాలను సాగు చేస్తున్నారు. చత్తీస్‌గడ్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాముడిపై తమ భక్తిని చాటుకుంటూ మరో మంచి నిర్ణయం తీసుకుంది. సుగుణబిరాముడి వేడుక కోసం నాణ్యతతో పాటు సుగంధభరితమైన బియ్యాన్ని సరఫరా చేయాలనుకున్నారు. 300 టన్నుల సుగంధ భరిత బియ్యాన్ని అయోధ్యకు తరలించారు.
వంద టన్నుల కూరగాయాలను పంపాలని నిర్ణయించుకున్న రైతులను, సుగంధ భరిత బియ్యాన్ని అయోధ్యకు తరలించిన చత్తీస్‌గఢ్‌  రైసుమిల్లర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను అభినందించారు చత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి. చత్తీస్‌గఢ్‌ నుంచి సుగంధభరిత బియ్యం  అయోధ్య బాటపట్టాయి.ఇదే రీతిన  భక్తిప్రపత్తులతో దేశ నలుమూలల నుంచి ఆహార ధాన్యాలు, కూరగాయాలు అయోధ్యకు భారీగా చేరుకుంటున్నాయి. రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి తరలి వచ్చే భక్తులకు భోజన, ప్రసాదాలు తయారు చేసేందుకు సర్వం సిద్దమయ్యాయి. ఇలా వస్తోన్న ధాన్యాన్ని అయోధ్యలోని కార్యశాలలో భద్రపరుస్తున్నారు. భక్తుల రావడం మొదలయ్యాక  వంటలు ప్రారంభిస్తారు. భక్తుల వసతి, భోజన సౌకర్యాలకు  శ్రీరామ జన్మభూమి తీర్థ ,క్షేత్ర ట్రస్ట్‌ అన్ని చర్యలు చేపట్టింది.
5oo ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేడుకక్కు వేళాయింది. ప్రస్తుతం దేశమంతా రాముడి ధ్యానంలో ఉంది. జనవరి 22వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య వేదికగా మహా సంరంభం సాక్షాత్కారం కాబోతుంది. మరోవైపు మహా సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లను చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..