Food Delivery Boy: వృత్తిని దైవంగా భావిస్తే ఫలితం ఉంటుంది మరి.. గుర్రంపై ఫుడ్‌ డెలివరీ .. ధనవంతుడైన డెలివరీ బాయ్‌

దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెకు దిగారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు ఎక్కడ ఆయిల్‌ సరఫరా ఆగిపోతుందేమోనన్న భయంతో తమ వాహనాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకునేందుకు బంకులవైపు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఎక్కడికి వెళ్లినా పెట్రోల్‌ బంకుల దగ్గర రద్దీ, అందులోనూ వాహనంలో పెట్రోల్‌ లేకపోవడంతో గుర్రాన్ని ఆశ్రయించాడు.

Food Delivery Boy: వృత్తిని దైవంగా భావిస్తే ఫలితం ఉంటుంది మరి.. గుర్రంపై ఫుడ్‌ డెలివరీ .. ధనవంతుడైన డెలివరీ బాయ్‌
Food Delivary Man
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Surya Kala

Updated on: Jan 04, 2024 | 7:51 AM

పెట్రోల్‌ కొరత ఆ డెలివరీ బాయ్‌ని ధనవంతుడిని చేసింది. అదెలా అనుకుంటున్నారా.. అవును దేశవ్యాప్తంగా ట్రక్‌, ఆయిల్‌ ట్యాంకర్‌, ప్రైవేట్‌ బస్సుల డ్రైవర్లు సమ్మెకు దిగారన్న వార్తలతో ఒక్కసారిగా పెట్రోల్‌ బంకుల్లో రద్దీ పెరిగిపోయింది. పెట్రోల్‌ ఎక్కడ దొరకదో అన్న భయంతో వాహనదారులంతా బంకుల దగ్గర క్యూ కట్టారు. పలు చోట్ల పెట్రోల్‌ బంకులు కూడా మూతపడ్డాయి. రోడ్లపైకి వాహనదారులు క్యూ కట్టడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో చట్టంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. డ్రైవర్‌ ఏదైనా యాక్సిడెంట్‌ చేసి వెళ్లిపోతే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా కట్టాలని చట్టంలో ఉంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మెకు దిగారు. పలుచోట్ల ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వాహనదారులు ఎక్కడ ఆయిల్‌ సరఫరా ఆగిపోతుందేమోనన్న భయంతో తమ వాహనాల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకునేందుకు బంకులవైపు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది.

అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఎక్కడికి వెళ్లినా పెట్రోల్‌ బంకుల దగ్గర రద్దీ, అందులోనూ వాహనంలో పెట్రోల్‌ లేకపోవడంతో గుర్రాన్ని ఆశ్రయించాడు. హైదరాబాద్‌ పాతబస్తీలోని చంచల్‌గూడకు చెందిన మహ్మద్‌ ఫారూఖ్‌ తన బైక్‌లో పెట్రోల్‌ అయిపోవడంతో బంక్‌ దగ్గరికి వెళ్లి దాదాపు 3 గంటలకుపైగా క్యూలో వేచిచూశాడు. ఎంతకీ పెట్రోల్‌ దొరకపోవడం, పైగా డెలివరీ సమయం అవుతుండటంతో వినూత్నంగా ఆలోచించాడు. ఎలాగైనా ఫుడ్‌ను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో తన అన్న దగ్గరికి వెళ్లి బైక్‌ను అక్కడ పెట్టి సోదరుడి దగ్గర ఉన్న గుర్రాల్లో ఒకటి తీసుకుని రోడ్లపై పరుగులు పెట్టించాడు.

ఇవి కూడా చదవండి

వీపునకు జొమాటో బ్యాగ్‌ వేసుకుని ఎంచక్కా ఆర్డర్స్‌ను కస్టమర్లకు వేగంగా అందించాడు. రోడ్లపై జొమాటో బాయ్‌ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. సోషల్‌ మీడియాలో డెలివరీ బాయ్‌ గుర్రపు స్వారీ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు ఫుడ్‌ను ఇలాకూడా డెలివరీ చేస్తారా అంటూ నివ్వెరపోయారు. పలువురు పని విషయంలో ఆ యువకుడికి ఉన్న నిబద్ధతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నో పెట్రోల్‌.. ఫాస్ట్‌ డెలివరి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన కొందరు రాజకీయ నాయకులు స్వయంగా యువకుడిని పిలిపించుకుని తమకు తోచిన కాడిని డబ్బును సాయంగా అందించారు. అతని పేదరికం, పనిపట్ల ఉన్న శ్రద్ధను కొనియాడారు. అలాగే మరికొందరు సైతం ముందుకొచ్చి ఆ డెలివరీ బాయ్‌కి సహాయం అందించి అభినందించారు. వాళ్ల ఇంట్లో గుర్రాలు ఉండేవని, చిన్నప్పటి నుంచే తనకు గుర్రపు స్వారీ అలవాటని ఫారూఖ్‌ చెబుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..