Hyderabad: రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌ మరో అరుదైన రికార్డ్‌.. 2023లో..

2023లో హైదరాబాద్‌లో ఏకంగా 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ - రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్‌లో పేర్కోంది. అంతకుముందు ఏడాది (2022)తో పోల్చితే ఇది 6 శాతం ఎక్కువ కావడం విశేషం. రెసిడెన్షియల్‌ లాంచింగ్‌ విషయంలో హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది...

Hyderabad: రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌ మరో అరుదైన రికార్డ్‌.. 2023లో..
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 04, 2024 | 7:38 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతేనే ఉంది. ఏడాదికేడాది సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 2023లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది నగరంలో రికార్డ్‌ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదికలో తెలిపింది. ఇది ఆల్‌టైమ్‌ గరిష్టమని నివేదిలో వెల్లడించింది.

2023లో హైదరాబాద్‌లో ఏకంగా 32,880 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఇండియా రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ రిపోర్ట్‌లో పేర్కోంది. అంతకుముందు ఏడాది (2022)తో పోల్చితే ఇది 6 శాతం ఎక్కువ కావడం విశేషం. రెసిడెన్షియల్‌ లాంచింగ్‌ విషయంలో హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది. నగరంలో రెసిడెన్షియల్ లాంచ్‌లు 2023లో 7 శాతం పెరిగి 46,985 యూనిట్లకు చేరుకున్నాయి. అమ్మకాలు భారీగా పెరగడానికి వినియోగదారులు లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, మంచి సౌకర్యాలు ఉండే కమ్యూనిటీలవైపు మొగ్గు చూపడం వంటి కారణాలగా నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అభిప్రాయపడింది

డిమాండ్‌-సరఫరా మెరుగ్గా ఉండడం, ఖరీదైన ఇళ్లకు కొనుగోలుదారుల ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలు ఇళ్ల ధరల్లోనూ గణనీయమైన పెరుగుదలకు దారితీశాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఇక ఇళ్ల ఖరీదు విషయానికొస్తే.. రూ.కోటికి మించి ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2018లో మొత్తం అమ్మకాల్లో ఇవి 21 శాతం ఉండగా 2023లో 49 శాతానికి పెరిగింది. 2022తో 11,632 యూనిట్లతో పోలిస్తే 2023లో 16,086 యూనిట్లకు పెరిగాయి.

అయితే రూ. 50 లక్షల లోపు విలువైన ఇళ్ల విక్రయాలు తగ్గినట్లు పేర్కొంది. ఈ విభాగనంలో 2018లో 26 శాతం నుంచి 2023లో 11 శాతాకి సగానికి పైగా తగ్గింది. 2022లో 5,630 యూనిట్ల నుంచి 2023లో 3,674 యూనిట్లకు తగ్గిపోయాయి. అలాగే రూ. 50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఉన్న ఇళ్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇళ్ల అమ్మకాలు 2018లో 52 శాతం నుంచి 2023లో 40 శాతానికి తగ్గాయి.

ఇదిలా ఉంటే 2023లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో ఇళ్ల సగటు ధరలో 11 శాతం పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా నగరంలోని వెస్ట్, సౌత్ రీజియన్లలో పెరుగుదల కనిపించింది. కోకాపేటలో అత్యధికంగా 39 శాతం, మణికొండలో 28 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఆఫీస్‌ మార్కెట్‌లోనూ హైదరాబాద్‌ సరికొత్త రికార్డులను సృష్టించింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) ముఖ్యంగా తమ ఐటీ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాలను నగరానికి విస్తరించడంతో 2023లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్‌లో వార్షిక లావాదేవీల్లో 32 శాతం పెరుగుదల నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే