AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. నేరుగా కేసీఆర్‌ ఇంటికి..

ప్రస్తుతం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే యశోద ఆసుపత్రిలో ఉన్న సమయంలో కార్యకర్తలు మొదలు సినీరాజకీయ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం కేసీఆర్‌ను పరామర్శించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌...

CM Jagan: నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. నేరుగా కేసీఆర్‌ ఇంటికి..
Jagan And Kcr
Narender Vaitla
|

Updated on: Jan 04, 2024 | 12:23 PM

Share

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాయం నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. గత నెల 7వ తేదీన ఫాం హౌజ్‌లో కిందపడడంతో తుంటి ఎముకకు గాయమైన విషయం విధితమే. అయితే వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు వారం రోజుల పాటు కేసీఆర్‌ హాస్పిట్‌లో ఉన్న తర్వాత హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు.

ప్రస్తుతం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే యశోద ఆసుపత్రిలో ఉన్న సమయంలో కార్యకర్తలు మొదలు సినీరాజకీయ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం కేసీఆర్‌ను పరామర్శించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం ఆ సమయంలో ఆసుపత్రికి రాలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం (నేడు) కేసీఆర్‌ను పరామర్శించడానికి జగన్‌ హైదరాబాద్‌ వస్తున్నారు.

మరికాసేపట్లో గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్‌ ఇంటికి వెళ్తారు. కేసీఆర్‌ ఇంట్లో జగన్‌ లంచ్‌ చేయనున్నారని సమాచారం. వీరిద్దరు గంటపాటు సమావేశం కానున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జగన్‌ కేవలం పరామర్శించడానికే కేసీఆర్‌ ఇంటికి వస్తున్నారని అంటున్నా.. రాజకీయంగా మాత్రం ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని షర్మిలకు అప్పగించనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో జగన్‌, కేసీఆర్‌ భేటీ ఆసక్తికరంగా మారిందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!