Viral: నీటిలో ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. ఏం చిక్కిందో చూస్తే స్టన్.!

మత్స్యకారులకు చేపల వేటే జీవనోపాధి. సముద్రంలోకి వెళ్లిన జాలర్లు.. ఒక్కోసారి తిరిగి ఒడ్డుకు చేరాలంటే.. వారం పడుతుంది. కొన్నిసార్లు వేటకు వెళ్లిన మత్స్యకారులకు.. వలలో అప్పుడప్పుడూ వింత జీవులు చిక్కుతుండటం సర్వసాధారణం. ఇలాంటి ఘటనే నెల రోజుల క్రిందట..

Viral: నీటిలో ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. ఏం చిక్కిందో చూస్తే స్టన్.!
Fishing Net
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2024 | 1:39 PM

మత్స్యకారులకు చేపల వేటే జీవనోపాధి. సముద్రంలోకి వెళ్లిన జాలర్లు.. ఒక్కోసారి తిరిగి ఒడ్డుకు చేరాలంటే.. వారం పడుతుంది. కొన్నిసార్లు వేటకు వెళ్లిన మత్స్యకారులకు.. వలలో అప్పుడప్పుడూ వింత జీవులు చిక్కుతుండటం సర్వసాధారణం. ఇలాంటి ఘటనే నెల రోజుల క్రిందట అస్సాంలో చోటు చేసుకుంది. బొంగైగాన్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మానస్ నదిలో అరుదైన భారీ బరాలీ చేపను పట్టుకున్నాడు. సుమారు 25 కిలోల బరువున్న ఈ బరాలీ చేపను స్థానికంగా టీ అమ్మే సిరాజుల్ హక్ అనే వ్యక్తి వలకు చిక్కింది. నంబరారా మార్కెట్ సమీపంలోని మానస్ నది ఒడ్డున భారీ చేపలు తిరుగుతుండటం హక్ కొంతకాలంగా చూస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో ఒకట్రెండు సార్లు వల వేసి.. పట్టుకోవాలని చూశాడు. ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం భారీ బరాలీ చేప అతడి వలకు చిక్కింది. దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చిన అతడు స్థానికంగా ఉన్న మార్కెట్‌లో రూ. 13 వేలకు విక్రయించాడు.

కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. బోలెడు అరుదైన చేపలు ప్రతీరోజూ మత్స్యకారులకు చిక్కిన సందర్భాలు మనం చూశాం. వాటిని జాలర్లు మార్కెట్‌లో అమ్మితే దాదాపు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు పలికాయి కూడా. వాటి వీడియోలు కూడా నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి.

ఆ చేప వీడియో ఇదే..