Watch Video: షాకింగ్ ఘటన.. అనుకూలంగా తీర్పు ఇవ్వలేదనీ కోర్టులోనే జడ్జిపై దాడి చేసిన నిందితుడు! వీడియో వైరల్
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కోర్టులో తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి జడ్జిపై దాడికి తెగబడ్డాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో కోపోధ్రిక్తుడైన సదరు వ్యక్తి కోర్టులో పోలీసులతో సహా అందరూ చూస్తుండగా ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చి జడ్జి పైకి దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా..
వాషింగ్టన్, జనవరి 4: అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కోర్టులో తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఓ వ్యక్తి జడ్జిపై దాడికి తెగబడ్డాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవడంతో కోపోధ్రిక్తుడైన సదరు వ్యక్తి కోర్టులో పోలీసులతో సహా అందరూ చూస్తుండగా ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చి జడ్జి పైకి దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
వాషింగ్టన్‌లోని ని క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టులో బుధవారం (జనవరి 3) ఈ ఘటన చోటుచేసుకుంది. డియోబ్రా రెడ్‌డెన్ (30) అనే నిందితుడి కేసుకు సంబంధించి న్యాయమూర్తి మేరీ కే హోల్థస్ తీర్పును చదువుతున్నారు. హానికరమైన బ్యాటరీతో దాడికి యత్నించిన ఘటనలో అతనిపై మూడు కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వాదప్రతివాదనలు జరిగాయి. కోర్టు నిందిడుడిని దోషిగా తేల్చింది. అతని ప్రొబేషన్ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయమూర్తి మేరీ కే హోల్థస్ అతను శిక్ష అనుభవించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దీంతో కోపోధ్రిక్తుడైన నిందితుడు డియోబ్రా రెడ్‌డెన్ ‘ఫక్ దట్ బిచ్’ అంటూ అకస్మాత్తుగా జడ్జి ఎదురుగా ఉన్న బెంచ్‌పైకి దూసుకుపోయాడు. మెరుపు వేగంతో జడ్జిపై అమాంతంగా పడిపోయి.. ఆమెను కొట్టసాగాడు. ఈ ఆకస్మిక చర్యకు అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే కోర్టు గది సిబ్బంది నిందితుడిని బంధించి, న్యాయమూర్తికి రక్షణ కల్పించేందుకు యత్నించారు. పోలీసులు అతన్ని బంధించిన వారితో పెనుగులాడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనలో న్యాయమూర్తి హోల్థస్ తలకు గాయమైనట్లు అధికారులు తెలిపారు. కోర్టు రూంలో ఉన్న అమెరికా జెండా, నెవాడా రాష్ట్ర జెండా నేలకూలాయి. కోర్టు మార్షల్‌కు కూడా గాయాలయ్యాయి.
Felon in LA attacks judge after she denied his probation.
This is the craziest court footage I’ve seen in a while:
— Crisis Report ⚠️ (@CrisisReportNet) January 3, 2024
క్లార్క్ కౌంటీ జిల్లా అటార్నీ స్టీవ్ వోల్ఫ్సన్ న్యాయమూర్తికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. నిందితుడి హింసాత్మక ప్రవర్తనను ఖండించారు. నిందితుడిని గురువారం రోజు కోర్టు ఎదుట సంకెళ్లతో బంధించి హాజరుపరచనున్నారు. గతంలోనూ రెడ్‌డెన్‌కు నేర చరిత్ర ఉంది. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.