Rare Bird: ఈ పక్షిలో ఆడ, మగ లక్షణాలు.! వందేళ్లలో కనిపించిన అరుదైన పక్షి ఇదే.!

Rare Bird: ఈ పక్షిలో ఆడ, మగ లక్షణాలు.! వందేళ్లలో కనిపించిన అరుదైన పక్షి ఇదే.!

Anil kumar poka

|

Updated on: Jan 04, 2024 | 3:20 PM

కొలంబియా దేశంలో శాస్త్రవేత్తలకు అత్యంత అరుదుగా కనిపించే గ్రీన్ హనీక్రీపర్ పక్షి దర్శనమిచ్చింది. గత వందేళ్లలో రెండోసారి మాత్రమే ఈ పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్‌ హమీష్‌ స్పెన్సర్‌ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. ఈ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు నీలం అంటే మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్‌ పక్షి అని పిలుస్తారు.

కొలంబియా దేశంలో శాస్త్రవేత్తలకు అత్యంత అరుదుగా కనిపించే గ్రీన్ హనీక్రీపర్ పక్షి దర్శనమిచ్చింది. గత వందేళ్లలో రెండోసారి మాత్రమే ఈ పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్‌ హమీష్‌ స్పెన్సర్‌ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. ఈ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు నీలం అంటే మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్‌ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు ఉన్న ఈకలను చూస్తే.. పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు ఉండే ఈకలను చూస్తే స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి.

అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజించి ఉంటాయి. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో తానింత వరకు ద్వైపాక్షిక ఆడ, మగ లక్షణాలను చూడలేదన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్‌ ఆప్‌ ఫీల్డ్‌ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్‌ స్పెన్సర్‌ వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.