Lottery: మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్న మహిళ.. ఆనందంలో స్టేజిపైనే.!
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తోందో తెలియదు. కడు నిరుపేదలను సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసేస్తుంది. తాజాగా అమెరికాలో ఓ మహిళకు అలాంటి అదృష్టమే పట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకుంది. నిర్వాహకులు ఆ విషయం ప్రకటించగానే ఆనందం తట్టుకోలేక అమాంతం స్టేజిపైన పడిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తోందో తెలియదు. కడు నిరుపేదలను సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసేస్తుంది. తాజాగా అమెరికాలో ఓ మహిళకు అలాంటి అదృష్టమే పట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకుంది. నిర్వాహకులు ఆ విషయం ప్రకటించగానే ఆనందం తట్టుకోలేక అమాంతం స్టేజిపైన పడిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పమేలా బ్రాడ్‌షా అనే మహిళ ఒక్కసారిగా మిలియనీర్ అయిపోయింది. గతంలో ఎప్పుడూ న్యూయార్క్ సందర్శించని ఆమె స్టేట్ లాటరీ ద్వారా న్యూయార్క్ సందర్శించే వీఐపీ ట్రిప్‌ను సైతం సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్లు గెలుపొందే అవకాశం కోసం దేశవ్యాప్తంగా మొత్తం ఐదుగురిని పవర్‌బాల్ ప్లేయర్లను ఎంపిక చేశారు. వారిలో పమేలా ఒకరు. బంతులన్నీ మిషిన్‌లో తిరిగాక ఓ బంతిని తీసి వదిలితే అది పమేలా నంబర్ అయిన ఒకటిని ప్రదర్శించింది. పమేలా యూ ఆర్ ఏ మిలియనీర్.. అంటూ గేమ్ నిర్వాహకులు ప్రకటించగానే ఆమె నమ్మలేకపోయింది… ఆనందం పట్టలేకపోయింది. స్టేజిపైనే అమాంతం పడిపోయింది. ఆమె వెంట ఉన్న కుమార్తెతోపాటు నిర్వాహకులు ఆమెను పైకి లేపారు. తనకు వచ్చిన డబ్బుతో కొత్త ఇల్లు కొనుక్కుంటానని, అంతకుమించి తనకు కలలు ఏవీ లేవని పమేలా తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.