Vijayawada: యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన టిప్పర్.! రోడ్డుపై యాసిడ్ లీక్..
ఎన్టీఆర్ జిల్లాలో నడిరోడ్డుపై యాసిడ్ ట్యాంకర్ లీకుతో జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకునుంచి లిక్విడ్ యాసిడ్ ఉబికి ధారగా రోడ్డుపై పడుతుంటే.. పొగలు పైకి ఎగజిమ్మాయి. దాంతో భయపడిన వాహనదారులు ఆ ట్యాంకర్‌కు దూరంగా వాహనాలు నిలిపి వేశారు. దీంతో స్థానికంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జూపూడి గ్రామం క్రాస్ రోడ్డు వద్ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొట్టింది.
ఎన్టీఆర్ జిల్లాలో నడిరోడ్డుపై యాసిడ్ ట్యాంకర్ లీకుతో జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకునుంచి లిక్విడ్ యాసిడ్ ఉబికి ధారగా రోడ్డుపై పడుతుంటే.. పొగలు పైకి ఎగజిమ్మాయి. దాంతో భయపడిన వాహనదారులు ఆ ట్యాంకర్‌కు దూరంగా వాహనాలు నిలిపి వేశారు. దీంతో స్థానికంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జూపూడి గ్రామం క్రాస్ రోడ్డు వద్ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్‌ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ డామేజ్ అయి యాసిడ్ ధారాళంగా లీకయి రోడ్డుపై ప్రవహించింది. వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌కు దూరంగా వాహనదారులను నిలిపివేసారు. అనంతరం యాసిడ్ లీక్‌ను ఆపేందుకు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ ఎక్కడ పేలుతుందో.. ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అందరూ ఆందోళన చెందారు. సురక్షితంగా యాసిడ్ లీక్‌ను ఆపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

