AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnant Job: గర్భవతిని చేస్తే లక్షల్లో జీతం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.!

Pregnant Job: గర్భవతిని చేస్తే లక్షల్లో జీతం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.!

Anil kumar poka
|

Updated on: Jan 04, 2024 | 5:27 PM

Share

బిహార్‌లోని నవాడా జిల్లాలో ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ ఏజెన్సీ పేరుతో ఓ ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. గర్భం దాల్చని స్త్రీలను గర్భవతులను చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి 13 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి, గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా 5 లక్షలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. దీంతో కొందరు ఇది నిజమేనని వెనకా ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు.

సమాజంలో నేరాల శైలి రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషుల బలహీనతలు, అత్యాశను ఆసరగా చేసుకొని కొందరు తమదైనశైలిలో మోసాలకు తెరతీస్తున్నారు. వలపువల విసిరి నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ సంఘటన గురించి వింటే.. ముక్కున వేలేసుకుంటారు.. బిహార్‌లోని నవాడా జిల్లాలో ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ ఏజెన్సీ పేరుతో ఓ ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. గర్భం దాల్చని స్త్రీలను గర్భవతులను చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి 13 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి, గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా 5 లక్షలు ఇస్తామని ప్రచారం చేసుకున్నారు. దీంతో కొందరు ఇది నిజమేనని వెనకా ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ దాగి ఉంది. నిజానికి ఇదొక ఫేక్‌ ఏజెన్సీ.. లాభదాయకమైన ఆఫర్‌ ముసుగులో ముందుగా ఆసక్తి చూపించిన వారి నుంచి 799 రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేశారు. అనంతరం వాట్సాప్‌లో మహిళల ఫొటోలు పంపించి, వీరినే గర్భవతులుగా చేయాలని తెలిపారు. ఇక అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద 20,000 వరకు చెల్లించాలని తెలిపారు. అంతేకాదు.. మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంకేముంది కొందరు వెనకా ముందు ఆలోచించకుండా వేలకు వేలు కట్టేశారు. తీరా చివరికి ఇదొక ఫేక్‌ ఏజెన్సీ అని తెలిసి తాము మోసపోయామని తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలసులు రంగంలోకి దిగారు. దాంతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం స్కామ్‌ వెనకాల మున్నా కుమార్‌ అనే సూత్రధారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు. ఇక ఈ స్కామ్ లో భాగమైన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.