Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.! 24 గంటల్లో 600 దాటిన కొత్తవేరియంట్‌ కేసులు

Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.! 24 గంటల్లో 600 దాటిన కొత్తవేరియంట్‌ కేసులు

Anil kumar poka

|

Updated on: Jan 04, 2024 | 5:40 PM

వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి.

దేశంలో కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా జూలు విదిలిస్తోంది. క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌-1 పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 600 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యఆరోగ్యశాఖ మరోసారి హెచ్చరించింది. వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్‌ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్‌ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.