Cold wave: వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.! ఢిల్లీలో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత.

Cold wave: వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.! ఢిల్లీలో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత.

Anil kumar poka

|

Updated on: Jan 04, 2024 | 5:56 PM

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్‌, హర్యానా, యూపీలో పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు.

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్‌, హర్యానా, యూపీలో పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం, రాత్రి వేళల్లో అయితే జనం ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. చలి, పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలావుంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు. ఒకటి నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు ఈ నెల 6 వరకు సెలవులు ప్రకటించారు. అయితే 9 నుంచి 12 వరకు చదువుతున్న పిల్లలకు సెలవులు ఇవ్వకపోయినా టైమింగ్స్‌లో మార్పులు చేశారు. వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.