Leopard: అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.
నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ ఓ అపార్ట్‌మెంట్ మెట్లెక్కి పైకి వెళ్లింది. కాసేపటికి తిరిగి కిందకు దిగింది. ఆ సమయంలో అక్కడున్న కొందరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలి కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ ఓ అపార్ట్‌మెంట్ మెట్లెక్కి పైకి వెళ్లింది. కాసేపటికి తిరిగి కిందకు దిగింది. ఆ సమయంలో అక్కడున్న కొందరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరుత సంచార సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వల సాయంతో చిరుతను బంధించే ప్రయత్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.