Viral: ఆన్‌లైన్‌లో రూ. 93 వేలకు మేకను ఆర్డర్ పెట్టాడు.. కట్ చేస్తే.. పార్శిల్ కోసం చూడగా..!
కుక్కపిల్ల.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్ల.. కాదేది కవితకు కానర్హం అనేది పాత సామెత.. ఇప్పుడు కుక్కపిల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు ఏదైనా కూడా ఇంటర్నెట్‌లో దొరకడం సహజమైపోయింది. మన దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ పెట్టేయొచ్చు.
కుక్కపిల్ల.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్ల.. కాదేది కవితకు కానర్హం అనేది పాత సామెత.. ఇప్పుడు కుక్కపిల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు ఏదైనా కూడా ఇంటర్నెట్‌లో దొరకడం సహజమైపోయింది. మన దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ పెట్టేయొచ్చు. ఇలా ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి.. వచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన మహ్మద్ ఖురేషి అనే వ్యక్తికి ఆన్‌లైన్ షాపింగ్ చేయడం అలవాటు. అతడు పొలం పనులు చూసుకుంటుండటంతో.. ఆన్‌లైన్ ద్వారా ఓ మాంచి మేకను కొనుగోలు చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే ఆన్‌లైన్‌లో మేక కోసం వెతికాడు. ఈ క్రమంలోనే ఓ వెబ్‌సైట్‌లో రూ. 86,695కు మాంచి మేక దొరికింది. ధర రూ.86,695.. ట్రాన్స్‌పోర్ట్ కోస్ట్ రూ.6,600 కలుపుకుని రూ.93,295 అయింది. వెంటనే ఆర్డర్ పెట్టేశాడు.
అయితే డబ్బులు ముందే ఇవ్వాలని అవతలి వ్యక్తులు చెప్పడంతో.. జనవరి 2వ తేదీన సదరు మొత్తాన్ని గూగుల్ పే ద్వారా పంపించాడు ఖురేషి. ముంబైలోని విక్రోలి జంక్షన్ దగ్గర మేకను డెలివరీ చేస్తామని.. అక్కడ వేచి ఉండమని అవతలి వ్యక్తులు చెప్పారు. అక్కడ ఖురేషి ఎంతసేపు ఎదురుచూసినా.. ఎవ్వరూ రాలేదు. చివరికి సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్‌కు డయిల్ చేసినా.. ఎలాంటి రిప్లయ్ లేకపోవడంతో.. తాను మోసపోయాయని గ్రహించాడు ఖురేషి. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖాకీలు. ఇక ఈ వార్త క్షణాల్లో స్థానికంగా వైరల్ కావడంతో.. ఇంటర్నెట్‌లో దేనినైనా ఆర్డర్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.