Video Viral: ప్రకృతి లో అద్భుతం.. నదిలో మరుగున్న నీరు ఎగసిపడుతున్న మంటలు..
వీడియోలో ఒక చెరువు కనిపిస్తోంది. దాని లోపల చాలా చోట్ల నీరు మరుగుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఒక చోట మంటలు ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మంటను చూస్తుంటే ఆరిపోదా అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నదులలో ఒకటిగా పరిగణించబడే దక్షిణాఫ్రికాలోని వాల్ నదిలో కనిపిస్తున్న దృశ్యం అని తెలుస్తోంది.
పంచభూతాల్లో అగ్ని, నీరు ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎక్కడైనా మంటలు చెలరేగితే నీళ్ళు పోసి ఆర్పివేస్తారు. అయితే నీటిలో మంటలు ఎగసిపడటం ఎప్పుడైనా చూసారా? అంటే నో అలా జరగదు.. అది సాధ్యం కాదని అంటారు. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో కనిపిస్తున్న దృశ్యం ఎవరికైనా షాక్ ఇస్తుంది. నీటిలో మంటలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నీరు మరుగుతున్నట్లు కనిపిస్తోంది. నీరు మరుగుతుంటే మంటలు ఎగసి పడడం ఏమిటని ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు.
వీడియోలో ఒక చెరువు కనిపిస్తోంది. దాని లోపల చాలా చోట్ల నీరు మరుగుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు ఒక చోట మంటలు ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మంటను చూస్తుంటే ఆరిపోదా అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నదులలో ఒకటిగా పరిగణించబడే దక్షిణాఫ్రికాలోని వాల్ నదిలో కనిపిస్తున్న దృశ్యం అని తెలుస్తోంది.
గత వారమే ఈ నదిలో అగ్నిప్రమాదం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు కారణం నీటిలో ఉన్న మిథేన్ వాయువు కారణం అని కొందరు చెబుతున్నారు. నీరు మరుగుతున్న చోట, మంటలు ఎగసి పడుతున్న చోట మీథేన్ గ్యాస్ లీక్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని టీవీ 9 ధృవీకరించలేదు.
వీడియో చూడండి
Methane gas leak in this body of water, Some has ignited pic.twitter.com/bmn7BZIFgF
— Science girl (@gunsnrosesgirl3) January 19, 2024
ఈ వీడియో @gunsnrosesgirl3 అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 12 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 41 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.
వీడియో చూసిన తర్వాత రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘ నీటి అడుగున మీథేన్ వాయువు ఎలా ఉంటుంది.. అని అంటే.. ఇది చాలా ప్రమాదకరమైనది’ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ‘ఇది అస్సలు నిజం అనిపించడం లేదు’ అని కొందరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..