Astro Tips: ఈ రాశివారితో వివాదం ఏర్పడితే.. ప్రతీకారం తీర్చుకునే వరకూ గజినీలా నిద్రపోరట..
ఏదైనా సంబంధాల్లో వైరుధ్యం ఎదురైతే.. చాలా మంది సామరస్యాన్ని, అవగాహనను కోరుకుంటారు. అయితే మరి కొందరు సంబంధాల వైరుధ్యాలను ఎదుర్కొన్నప్పుడు ప్రతీకారం వైపు మొగ్గు చూపుతారు. అలా సంబంధాల్లో ఏదైనా వివాదం ఏర్పడితే.. ప్రతీకారం తీర్చుకోవాలని ఎక్కువగా నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు కోరుకుంటారట. ఈ రోజు ఆ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో మనిషి నడవడిక రాశులు, గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ప్రతి రాశి ప్రత్యేక లక్షణాలను, ధోరణులను కలిగి ఉంటాయి. ఏదైనా సంబంధాల్లో వైరుధ్యం ఎదురైతే.. చాలా మంది సామరస్యాన్ని, అవగాహనను కోరుకుంటారు. అయితే మరి కొందరు సంబంధాల వైరుధ్యాలను ఎదుర్కొన్నప్పుడు ప్రతీకారం వైపు మొగ్గు చూపుతారు. అలా సంబంధాల్లో ఏదైనా వివాదం ఏర్పడితే.. ప్రతీకారం తీర్చుకోవాలని ఎక్కువగా నాలుగు రాశులకు చెందిన వ్యక్తులు కోరుకుంటారట. ఈ రోజు ఆ నాలుగు రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృశ్చిక రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులు తీవ్రమైన, ఉద్వేగభరితమైన స్వభావానికి ప్రసిద్ధి చెందినవారు. ఎవరైనా తమకు ద్రోహం చేసినట్లు తెలుసుకుంటే.. వారిని నాశనం చేసే వరకూ నిద్రపోరు.. నిరంతరం తమ ప్రతీకారం తీర్చుకునే మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సంబంధంలో తప్పుగా భావిస్తే వీరి సంకల్పం మారుతుంది.. విధేయత ప్రతీకారంగా మారవచ్చు.
సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు అహంకారపూరిత నేచర్ ని కలిగి ఉంటారు. దీంతో ఎవరైనా తమ అహంకారాన్ని దెబ్బతీసినట్లు భావిస్తే.. ప్రతీకారం తీర్చుకుంటారు. తమ అహంకారాన్ని చల్లార్చుకుంటారు. ముఖ్యంగా తమకు దక్కాల్సిన గౌరవం, ప్రశంసలను ఎదుటివారు అడ్డుపడుతున్నలు గమనించినా.. కోరిక, సంబంధాలలో తమకు అన్యాయం చేసినట్లు భావిస్తే.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత దూరానికైనా వెళ్లారు.
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్రేకం, శీఘ్ర కోపానికి ప్రసిద్ధి చెందారు. సంఘర్షణ జరుగుతుంటే హఠాత్తుగా ప్రతిస్పందిస్తారు. పరిణామాలను పూర్తిగా పరిగణలోకి ప్రతీకారం తీర్చుకుంటారు. వీరు మండుతున్న అగ్ని వంటివారు.. వేడిలో త్వరగా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటారు.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వారు భావోద్వేగాలను మనసులో దాచుకుంటారు. అయితే వీరు మానసికంగా గాయపడినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా వెనుకాడరు. ముఖ్యంగా సున్నితత్వం సంబంధం విషయంలో మానసికంగా ఇబ్బంది పడినప్పుడు అవతలివారిని అదే విధంగా బాధించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరిలో
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు