AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అదివో బాల రాముడి విగ్రహం.. గర్భ గుడిలో ఠీవిగా కొలువుదీరిన రామచంద్రుడు .. 2 రోజుల్లో యావత్ ప్రపంచం దర్శనం..

మరో రెండు రోజుల్లో ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న ఈ బాల రామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఐదు అడుగుల ఎత్తున్న బాల రాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. బాల రాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్నిఅరుణ్ యోగిరాజ్ చెక్కారు. మూడు విగ్రహాలు తయారు చేయించగా.. వాటిల్లో అరుణ్ యోగిరాజ్ చేతులమీదుగా మలచబడిన బాల రామయ్య విగ్రహం ఎంపిక చేయబడింది.

Ayodhya: అదివో బాల రాముడి విగ్రహం.. గర్భ గుడిలో ఠీవిగా కొలువుదీరిన రామచంద్రుడు .. 2 రోజుల్లో యావత్ ప్రపంచం దర్శనం..
Ayodhya Ram Lalla
Surya Kala
|

Updated on: Jan 19, 2024 | 2:36 PM

Share

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు సాంప్రదానుసారంగా సాగుతున్నాయి. ఇప్పటికే బాల రాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. లేటెస్ట్‌గా బాల రాముడి విగ్రహం పొటోలు బయటకు వచ్చాయి. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు. బాల రాముడి విగ్రహానికి ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను సిద్ధం చేయించారు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భ గుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహానికి కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు.

మరో రెండు రోజుల్లో ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న ఈ బాల రామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు. ఐదు అడుగుల ఎత్తున్న బాల రాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపు గుడ్డతో కప్పి ఉంచారు. బాల రాముడికి ప్రాణం పోస్తూ ఈ విగ్రహాన్నిఅరుణ్ యోగిరాజ్ చెక్కారు.

మూడు విగ్రహాలు తయారు చేయించగా.. వాటిల్లో అరుణ్ యోగిరాజ్ చేతులమీదుగా మలచబడిన బాల రామయ్య విగ్రహం ఎంపిక చేయబడింది. రామయ్య చిన్నతనంలో ఇలాగే ఉండేవారా అన్నట్లు జీవం ఉట్టిపడుతోంది.

ఇవి కూడా చదవండి

బాల రాముడి విగ్రహాన్ని గర్భ గుడిలోకి తీసుకొచ్చినందున ఆలయ ప్రాంగణంలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచం రామ్ లల్లాను దర్శించుకోనుంది. అయితే ప్రస్తుతం గర్భ గుడిలోని రామయ్య ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..