Ayodhya: అయోధ్యలో మరింత భద్రత.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్

అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. అనుమానితులను విచారిస్తున్నట్లు డీజీపీ కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం , పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చెక్ డ్రైవ్‌లో భాగంగా..  యుపి-ఎటిఎస్ అయోధ్య జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేసింది.

Ayodhya: అయోధ్యలో మరింత భద్రత.. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్
3 Suspects From Ayodhya
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2024 | 2:12 PM

కోట్లాది రామ భక్తుల కల తీరే సమయం రానే వచ్చేసింది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అడుగడుగునా నిఘా నేత్రం పనిచేస్తోంది. ప్రతి చర్యను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు (జనవరి 19వ తేదీ గురువారం) అయోధ్యలో ముగ్గురు అనుమానితులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది.

అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. అనుమానితులను విచారిస్తున్నట్లు డీజీపీ కుమార్ చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం , పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చెక్ డ్రైవ్‌లో భాగంగా..  యుపి-ఎటిఎస్ అయోధ్య జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ అనుమానితులను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థతోనూ వీరికి సంబంధం ఉన్నట్లు వెలుగులోకి రాలేదు అన్నారు డీజీపీ కుమార్. రామమందిర ప్రారంభోత్సవం మూడు రోజుల ముందు ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నగరం అంతటా.. డ్రోన్ల ద్వారా నిఘా పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. నగరం అంతటా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైట్ విజన్ పరికరాలు (NVD) CCTV కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచింది.

ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గర్భ గుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రతి ష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. జనవరి 22న  రామ్ లల్లా  మహామస్తకాభిషేక ప్రధాన కార్యక్రమాన్ని వారణాసి అర్చకుడు లక్ష్మీకాంత దీక్షిత్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

జనవరి 14 నుంచి అయోధ్యలో మొదలైన అమృత మహోత్సవాలు జనవరి 22 వరకు జరుగుతాయి. విగ్రహ ప్రతిష్ట వేడుక తేదీ సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో రామభక్తుల సంఖ్య పెరుగుతోంది. రామమందిర నిర్మాణం కోసం 500 ఏళ్లకు పైగా ఎదురు చూస్తున్న రామభక్తులు ఈ క్షణాన్ని చూడాలని కోరుకుంటున్నారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..