Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం కరసేవకు వెళ్లి గుడి కట్టాకే పెళ్లి అని భక్తుడి శపథం.. నేడు ప్రతిష్టాపనకు ఆహ్వానం..

భోజ్‌పాలి బాబా అయోధ్యలో కరసేవ గురించి మాట్లాడుతూ.. తనకు అయోధ్య ఉద్యమం ఉత్సాహాన్ని కలిగించిందని.. డిసెంబర్ 6న తన స్నేహితులతో కలిసి కర సేవలో పాల్గొనడానికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కర సేవలో పాల్గొనడానికి నిరాకరించారని దీంతో  బట్టలు, డబ్బులు లేకుండా ఉత్త చేతులతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం కరసేవకు వెళ్లి గుడి కట్టాకే పెళ్లి అని భక్తుడి శపథం.. నేడు ప్రతిష్టాపనకు ఆహ్వానం..
Ayodhya Ram Temple
Follow us
Surya Kala

| Edited By: Balaraju Goud

Updated on: Dec 23, 2023 | 5:59 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల కల తీరే సమయం ఆసన్నం అవుతోంది. అయోధ్యలో ప్రతిష్ట్మాత్మకంగా నిర్మిస్తున్న రామాలయంలో రామయ్య కొలువుదీరనున్నాడు. రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా భోపాల్‌కు చెందిన భోజ్‌పాలి బాబాకు ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ, ప్రముఖులు, సాధువులతో పాటు బలరామయ్య ప్రతిష్టాపనకు ఆహ్వానం అందుకున్న భోజ్‌పాలి బాబా ప్రత్యేకత ఏమిటో తెలుసా..!

భోజ్‌పాలి బాబా అసలు పేరు రవీంద్ర గుప్తా. 6 డిసెంబర్ 1992న తన స్నేహితులతో కలిసి కరసేవలో పాల్గొనడానికి అయోధ్యకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మించే వరకు పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు రవీంద్ర వయస్సు కేవలం 22 సంవత్సరాలు.  31 ఏళ్ల క్రితం శపథం చేసిన రవీంద్ర గుప్తా.. భోజ్‌పాలి బాబాగా మారి 3 దశాబ్దాలుగా రామయ్య సేవలో తరిస్తున్నాడు.

రవీంద్ర గుప్తా భోజ్‌పాలి బాబా ఎలా అయ్యాడంటే

రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తనకు నర్మదా పరిక్రమ పట్ల ఆసక్తి కలిగిందని బాబా చెప్పారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ నుండి బయటకు వచ్చి పరిక్రమ ప్రారంభించాడు. రవీంద్ర ఇప్పటి వరకు నర్మదా నదికి ఐదుసార్లు ప్రదక్షిణలు చేశాడు. అప్పటి నుంచి బేతుల్ సమీపంలోని మిలాన్పూర్ గ్రామంలో నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విశ్వహిందూ పరిషత్, సంఘ్‌లో రవీంద్ర గుప్తా క్రియాశీలకంగా ఉన్న సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిన కొందరు ఆయన బసకు ఏర్పాట్లు చేశారు. బేతుల్ చిరునామాలో అయోధ్య నుండి భోజ్‌పాలి బాబాకి  ఆహ్వానం అందింది.

తాజాగా భోజ్‌పాలి బాబా అయోధ్యలో కరసేవ గురించి మాట్లాడుతూ.. తనకు అయోధ్య ఉద్యమం ఉత్సాహాన్ని కలిగించిందని.. డిసెంబర్ 6న తన స్నేహితులతో కలిసి కర సేవలో పాల్గొనడానికి వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కర సేవలో పాల్గొనడానికి నిరాకరించారని దీంతో  బట్టలు, డబ్బులు లేకుండా ఉత్త చేతులతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్టేషన్‌కు చేరుకుని రవీంద్ర గుప్తాను వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఒప్పించలేక చివరకి రవీంద్ర అన్నయ్య కూడా కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకుని రామమందిరం నిర్మించే పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. కర సేవ సమయంలో అయోధ్య నుండి ఇటుకలు కూడా తెచ్చారు.

భోజ్‌పాలి బాబా తీసుకున్న ఈ నిర్ణయానికి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయం వెనుక్కి తీసుకోమని చెప్పినా బాబా అంగీకరించలేదు. ఆ సమయంలో భోజ్‌పాలి బాబా ఆలయ నిర్మాణం మూడు-నాలుగేళ్లలో సిద్ధమవుతుందని భావించారు. బాబా దాదాపు 12 సంవత్సరాలు భోపాల్‌లో గడిపారు. 2004 వరకు విద్యార్థి పరిషత్ మరియు RSS లో క్రియాశీల పాత్ర పోషించాడు. 2007లో విశ్వహిందూ పరిషత్‌లో పూర్తిస్థాయి సంస్థాగత మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం భోజ్‌పాలి బాబా తన నర్మదా ప్రయాణాలపై ఒక పుస్తకం కూడా రాస్తున్నారు.

రామమందిర ఉద్యమం ప్రారంభమైనప్పుడు తాను భోపాల్‌లోని రామ జానకీ దేవాలయం లఖేరాపురలో ఉండేవాడినని బాబా భోజ్‌పాలి చెప్పారు. ఇప్పుడు రామ మందిరానికి ఆహ్వానం అందినందుకు బాబా చాలా సంతోషంగా ఉన్నారు. 53 ఏళ్ల భోజ్‌పాలి బాబా ఇప్పుడు తన జీవితం నర్మదానది కోసం, మాతృ దేశం  భారతమాత సేవలో గడపాలనుకుంటున్నట్లు చెప్పారు. భోపాల్‌కు చెందిన రవీంద్ర గుప్తాను ప్రజలు  భోజ్‌పాలి బాబా అని పిలవడం ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..