Vastu Tips: ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా.? కొత్తేడాది ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి..

ఇంట్లో డబ్బులు నిలవకపోవడానికి వాస్తు లోపాలు కూడా కారణాలుగా వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న వాస్తు లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న వాస్తు లోపాలను కొన్ని వస్తువులతో తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని వస్తువులను ఈ కొత్త ఏడాది ఇంట్లోకి తెచ్చుకుంటే వాస్తు లోపాలను తొలగించుకోవచ్చని వాస్తు పండతులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.?

Vastu Tips: ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా.? కొత్తేడాది ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి..
Vastu For Home
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2023 | 2:26 PM

ప్రతీ ఒక్కరూ కష్టపడేది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలా వచ్చిన డబ్బు ఇలా ఖర్చవుతుంటుంది. ఇలా ఇంట్లో డబ్బులు నిలవకపోవడానికి వాస్తు లోపాలు కూడా కారణాలుగా వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న వాస్తు లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న వాస్తు లోపాలను కొన్ని వస్తువులతో తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని వస్తువులను ఈ కొత్త ఏడాది ఇంట్లోకి తెచ్చుకుంటే వాస్తు లోపాలను తొలగించుకోవచ్చని వాస్తు పండతులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.? వాటి ద్వారా ఎలాంటి లాభాలు జరుగుతాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* కొత్తేడాది ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో నెమలీకలు ఒకటి. వీటిని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవీ కటాక్షం ఎల్లవేళలా మీపై ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. జీవితంలో సంతోషం, శ్రేయస్సు, ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఇంట్లో ఒక నెమలీక ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన మరో వస్తువు తులసి మొక్క. సంక్షోభం నుంచి బయటపడడానికి, లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండడానికి నిత్యం తులసి మొక్కను పూజించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. తులసి మొక్కకు నిత్యం పూజ చేసే ఇల్లు సిరిసంపదలతో నిండి ఉంటుంది. తులసి మొక్కను సరైన గాలి, వెలుతురు తగిలే చోట ఏర్పాటు చేసుకోవాలి.

* ఇక కొత్తేడాదిలో ఇంటికి ఒక వెండి ఏనుగుని తెచ్చుకోవడం మర్చిపోకండి. రాహు, కేతువుల దుష్ఫ్రభావాలు ఏమైనా ఉంటే వెండి ఏనుగు ఏర్పాటు చేసుకోవడం వల్ల తగ్గిపోతాయి. వ్యాపారంలో వృద్ధి, ఉపాధిలో ఎదుగుదల కనిపిస్తుంది.

* ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమై, వచ్చే ఏడాదంతా సంతోషంగా ఉండాలంటే ఇంట్లో.. వెండి, ఇత్తడి,లేదా కంచుతో తయారు చేసిన తాబేలును ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. లోహపు తాబేలును ఉత్తరం వైపు ఉంచటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

* ఇక ఇంట్లో మనకు తెలిసీ తెలియక ఏమైనా వాస్తు లోపాలు ఉంటే.. పిరమిడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెండి, ఇత్తడి, రాగి ఏదైనా పిరమిడ్‌ను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంతోషం వెల్లివిరుస్తుంది.

* కొత్తేడాది ఇంట్లో తెచ్చుకోవాల్సిన మరో వస్తువు పంచముఖి హనుమాన్‌ విగ్రహం. అన్ని విధాల కలిసిరావలన్నా, ఇంట్లో నెగిటివ్‌ ప్రభావం తగ్గాలన్నా నైరుతి దిశలో పంచముఖి హనుమాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు పండితులు తెలిపిన వివరాలు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే