AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Smriti Irani: గాంధీ కుటుంబం అమేథీ రైతులను లూటీ చేసింది.. 30 ఎకరాల భూమిని రూ. 600కి తీసుకున్నారంటూ స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు

స్మృతి ఇరానీ మాట్లాడుతూ ప్రజలు నన్ను విశ్వసించగలరని నమ్మడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నారు. గాంధీ కుటుంబం ఇక్కడ వారి భూములను ప్రజల నుంచి లాక్కుంది. ఇదే విషయాన్ని తాను  పార్లమెంటులో చెప్పాను. 30 ఎకరాల భూమిని కేవలం రూ.600కి అద్దెకు తీసుకున్నారు. ఆ భూమిలో గాంధీ కుటుంబం తమ కోసం ఒక అందమైన కాంప్లెక్స్‌ని నిర్మిస్తుందని వెల్లడించారు.

Minister Smriti Irani: గాంధీ కుటుంబం అమేథీ రైతులను లూటీ చేసింది.. 30 ఎకరాల భూమిని రూ. 600కి తీసుకున్నారంటూ స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు
Smriti Irani Alleges Gandhi Family
Surya Kala
|

Updated on: Dec 23, 2023 | 3:01 PM

Share

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఓడించి అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి స్మృతి ఇరానీ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ‘పారిశ్రామికీకరణ’ పేరుతో అమేథీలో రైతులు, ఇతర వ్యక్తుల నుంచి గాంధీ కుటుంబం భూములను లాక్కుందని ఆరోపించారు. మైనారిటీ బాలికల కోసం ఉపయోగించాల్సిన భూమిని గాంధీ కుటుంబం తమ ఆఫీసు కోసం లాక్కుందని అన్నారు.

అమేథీ ప్రజలను మోసం చేసిన గాంధీ కుటుంబం

స్మృతి ఇరానీ మాట్లాడుతూ ప్రజలు నన్ను విశ్వసించగలరని నమ్మడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నారు. గాంధీ కుటుంబం ఇక్కడ వారి భూములను ప్రజల నుంచి లాక్కుంది. ఇదే విషయాన్ని తాను  పార్లమెంటులో చెప్పాను. 30 ఎకరాల భూమిని కేవలం రూ.600కి అద్దెకు తీసుకున్నారు. ఆ భూమిలో గాంధీ కుటుంబం తమ కోసం ఒక అందమైన కాంప్లెక్స్‌ని నిర్మిస్తుందని వెల్లడించారు. పారిశ్రామికీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రముఖ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు అమేథీలోని రైతుల భూములను లాక్కున్నారని స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు.

గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లిన వ్యక్తులపై సిట్‌ కేసు పెట్టి జైలులో పెట్టారని ఇరానీ పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయిన స్మృతి ఇరానీ, 2019లో గాంధీ నుంచి సీటును కైవసం చేసుకోవడం ద్వారా ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు . 47 ఏళ్ల ఇరానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలు.

ఇవి కూడా చదవండి

రాజకీయ విభేదాల కారణంగా కుటుంబంలో విభేదాలు

స్మృతి ఇరానీ తన జీవితం గురించి మాట్లాడుతూ.. తనకు స్కాలర్‌షిప్ ఎలా వచ్చిందో చెప్పారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని తన కాళ్లపై తాను నిలబడాలని ముంబైకి వెళ్లాలనుకున్నానని చెప్పారు. తన తల్లిదండ్రుల్లో భిన్నమైన భావజాలం ఉన్నందున తన కుటుంబంలో చాలా విబేధాలు ఉండేవని చెప్పారు స్మృతి ఇరానీ. అంతేకాదు తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో పని చేసేవారని..  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని వెల్లడించారు.

రాజీవ్ మృతి చెందిన సమయంలో తన తండ్రి రోదించడం తాను చూశానని కేంద్రమంత్రి తెలిపారు. అయితే తన తల్లి ‘సంఘి’ , జన్ సంఘ్‌లో భాగమని.. విశ్వహిందూ పరిషత్ కి సంబంధించిన ఢిల్లీ కార్యాలయంలోని “శాఖ”కు వెళ్ళేవారని గుర్తు చేసుకుంది. తాను తల్లితో పాటు చాలాసార్లు విశ్వహిందూ పరిషత్ కి వెళ్లేదానినని  స్మృతికి చెప్పారు. రాజకీయలతో తన ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..