AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ రెచ్చిపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలు.. అమెరికాలోని ఆలయ గోడపై భారత వ్యతిరేక నినాదాలు

స్వామినారాయణ్ ఆలయం మీద భింద్రేన్‌వాలే రాతలు రాశారు. ఇలా రాయడం భయం సృష్టించేదిగా ఉందని భారత్‌ ఆరోపించింది. ఒకవైపు ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్ను మీద హత్యాయత్నం చేశారంటూ దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లోనే హిందూ దేవాలయాల మీద రాతలు కలకలం రేపుతున్నాయి.

మళ్ళీ రెచ్చిపోయిన ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలు.. అమెరికాలోని ఆలయ గోడపై భారత వ్యతిరేక నినాదాలు
Pro Khalistan Slogans
Balaraju Goud
|

Updated on: Dec 23, 2023 | 1:44 PM

Share

ఖలిస్తాన్‌ ఉగ్రవాద మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. అమెరికాలోని హిందూ దేవాలయం గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్‌ సిటీలో ఈ దారుణం జరిగింది. స్వామినారాయణ్‌ మందిర్‌ గోడల మీద రాసిన రాతలతో కలకలం రేగింది.

ఖలిస్తాన్ మద్దతుదారులు మరోసారి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో, ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసి, ఆలయ పరిసరాలను ధ్వంసం చేశారు. స్వామినారాయణ దేవాలయం గోడలపై నల్లరంగుతో అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే నెవార్క్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

అమెరికాకు చెందిన హిందూ-అమెరికన్ ఫౌండేషన్ ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో పాటు, స్వామినారాయణ్ మందిర్ వాస్నా సంస్థను ఖలిస్తాన్ మద్దతుదారులు లక్ష్యంగా చేసుకున్నారని, దాని గోడలపై ఖలిస్తానీ నినాదాలు రాసి దానిని కూడా పాడు చేశారని ఫౌండేషన్ క్యాప్షన్‌లో రాసింది. ఈ విషయాన్ని ఫౌండేషన్ పోలీసులతో పాటు పౌర హక్కుల విభాగానికి తెలియజేసింది. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.

ఈ విషయంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వామినారాయణ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు రాయడాన్ని ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనతో భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంది. దీనిపై అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేసింది భారత్‌.

అయితే, విదేశీ గడ్డపై హిందూ మత స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఖలిస్తానీలు ఆస్ట్రేలియా, కెనడాలోని దేవాలయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇటువంటి సంఘటనలపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అనేక దౌత్య వేదికలలో ఈ అంశాన్ని లేవనెత్తింది.

స్వామినారాయణ్ ఆలయం మీద భింద్రేన్‌వాలే రాతలు రాశారు. ఇలా రాయడం భయం సృష్టించేదిగా ఉందని భారత్‌ ఆరోపించింది. ఒకవైపు ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్ను మీద హత్యాయత్నం చేశారంటూ దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లోనే హిందూ దేవాలయాల మీద రాతలు కలకలం రేపుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఆలయ తలుపులకు ఖలిస్తానీ పోస్టర్లు అతికించారు. ఈ ఘటన మొత్తం ఆవరణలోని సీసీటీవీలో రికార్డయింది. ఇలాంటి ఉదంతం ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వెలుగుచూసింది. ఇక్కడి స్వామినారాయణ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు భారత వ్యతిరేక నినాదాలు కూడా రాశారు. హిందుస్థాన్ ముర్దాబాద్ మరియు ఖలిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు మరొక దేవాలయమైన ఇస్కాన్ ఆలయంలోనూ వెలిశాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…