నీళ్లు తాగటం మానేసింది..! టీ, జ్యూసెస్ మాత్రమే అలవాటు చేసుకున్న మహిళ కిడ్నీలో 300రాళ్లు..

వైద్యులు ఆమెకు 2 గంటల పాటు ఆపరేషన్‌ చేసి ఆమె కిడ్నీ నుండి దాదాపు 300 రాళ్లను తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా మారిన తర్వాత మహిళను ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ చేశారు. అయితే, శరీరంలో నీటిశాతం తగ్గితే రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా, స్త్రీల కంటే పురుషులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అంటున్నారు వైద్యులు.

నీళ్లు తాగటం మానేసింది..! టీ, జ్యూసెస్ మాత్రమే అలవాటు చేసుకున్న మహిళ కిడ్నీలో 300రాళ్లు..
Kidney Stones
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2023 | 9:53 PM

తైవాన్‌కు చెందిన ఓ వైద్యుడు ఓ మహిళ కిడ్నీ నుంచి 300కు పైగా కిడ్నీ రాళ్లను తొలగించారు. ఆమె నీళ్లకు బదులుగా కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌లు మాత్రమే తాగుతూ తనను తాను హైడ్రేట్ చేసుకునేదని తెలిసింది.. జియావో యు అనే 20 ఏళ్ల మహిళ జ్వరం, నడుము భాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతూ గత వారం తైవాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరింది. యువతి సమస్యను గుర్తించేందుకు వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించగా, ఆమె కుడి కిడ్నీ ద్రవంతో వాచిపోయిందని తేలింది.. అందులో వందల కొద్దీ రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. CT స్కాన్ ప్రకారం, రాళ్ళు 5mm, 2cm సైజులో పెరిగిపోయి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ తర్వాత రక్తపరీక్షల్లో తెల్లరక్తకణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి కారణం ఏమిటని అన్ని టెస్టులు చేశారు. పూర్తి ఆరా చేయగా, ఆమె నీటి చుక్క కూడా తాగడం ఉండేదని తెలిసింది. నీటికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్ మరియు ఆల్కహాలిక్ పానీయాలు తాగడం ద్వారా తనను తాను హైడ్రేట్ చేసుకుంటానని ఆమె వైద్యుడికి చెప్పింది. ఈ కారణంగానే ఆమె కిడ్నీలో రాళ్లు పేరుకుపోయాయని డాక్టర్లు చెప్పారు.

వైద్యులు ఆమెకు 2 గంటల పాటు ఆపరేషన్‌ చేసి ఆమె కిడ్నీ నుండి దాదాపు 300 రాళ్లను తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా మారిన తర్వాత మహిళను ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ చేశారు.

బబుల్ టీ అంటే ఏమిటి..?

ఇవి కూడా చదవండి

బబుల్ టీ 1980లలో తైవాన్‌లో తయారైంది. ఆ తర్వాత అది ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు తెచ్చుకుంది. ఈ రోజుల్లో ఇది పాశ్చాత్య, యూరోపియన్, ఆసియా దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాలా మంది టీనేజర్లు ఈ టీని ఇష్టపడుతుండటం విశేషం. దీనిని బబుల్ టీ, బోబా టీ, పెర్ల్ టీ లేదా టేపియోకా టీ అని కూడా అంటారు. ఇది పాలు లేదా పచ్చి ఆకులను ఉపయోగించి తయారుచేస్తారు. బబుల్ టీలో షుగర్ ఎక్కువగా ఉండి, అనారోగ్యకరమైన పానీయం అయినప్పటికీ, బబుల్ టీ, తక్కువ చక్కెర కంటెంట్ ఉన్న గ్రీన్ టీ తాగడం వల్ల మెదడుకు పదును, శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లకు కారణాలు:

తక్కువ నీరు తీసుకోవడం, బరువు తగ్గించే శస్త్రచికిత్స లేదా ఎక్కువ ఉప్పు లేదా చక్కెరతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్యలు వస్తుంటాయి. అలాగే, వ్యాయామం లేని వారి శరీరంలో కూడా అప్పుడప్పుడు కిడ్నీల్లో రాళ్ల సమస్య ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడానికి ఎక్కువ నీరు త్రాగటం అవసరం. శరీరంలో తగినంత నీరు లేనట్లయితే, కిడ్నీల్లో రాళ్లు సులభంగా పేరుకుపోతాయి. శరీరంలో నీటిశాతం తగ్గితే రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణంగా, స్త్రీల కంటే పురుషులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!