TV నల్లగా, AC రంగు తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా..? ఎరుపు, పసుపు రంగులో ఎందుకుండదు..

దీని కారణంగా లోపల కంప్రెసర్ సురక్షితంగా ఉంటుంది. వేసవిలో సూర్య కిరణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కిరణాలు తెలుపు రంగు వైపు తక్కువగా శోషించబడతాయి. సూర్యకిరణాలు AC మెషీన్‌కు చేరకుండా, వేడెక్కకుండా నిరోధించడానికి ఏసీలు తెలుపు లేదంటే, ఇతర లైట్ షేడ్స్‌లో ఉంటుంది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి మనం తెల్లటి దుస్తులు ధరించినట్లే అదే కారణంతో ఏసీలకు తెల్లటి రంగు వేస్తారు.

TV నల్లగా, AC రంగు తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా..? ఎరుపు, పసుపు రంగులో ఎందుకుండదు..
Tv And Ac
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2023 | 8:29 PM

ఈ రోజుల్లో, భారతదేశంలో టీవీ, ఏసీ లేకుండా జీవించడం చాలా కష్టం. టీవీ లేకుండా రెండు రోజులు కూడా గడపడం సాధ్యం కాదు..ఇక వేసవి కాలంలో చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ప్రజలు వాయిదాల మీదైనా సరే ఏసీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. మనం టీవీ గురించి మాట్లాడినట్లయితే, ఇప్పటివరకు ప్రపంచంలో తయారు చేయబడిన లేదంటే విక్రయించబడిన అన్ని టీవీ సెట్లు. అన్నీ టీవీల బాడీ నలుపు రంగులోనే ఉంటుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు లేదా నీలం రంగులో టీవీ సెట్ ఉండదు.. ఇప్పటి వరకు కనిపించలేదు కూడా. అయితే, దీని వెనుక కారణం ఏంటో తెలుసా..? దీని వెనుక నిర్దిష్ట శాస్త్రీయ కారణం లేదు. కానీ ఖచ్చితంగా ఒక సాధారణ లాజిక్ మాత్రం ఉంది. అందుకే టీవీ నలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే టీవీ బాడీ స్ట్రాంగ్‌ ఉండటం చాలా ముఖ్యం. సాధారణంగా టీవీని చాలా సార్లు అట్నుంచి ఇట్నుంచి అటు జరుపుతుంటారు. సౌండ్‌ సిస్టమ్‌ ఎక్కువగా పెడుతుంటారు. అటువంటి పరిస్థితిలో టీవీ బాడీ బలహీనంగా ఉంటే అది విరిగిపోతుంది.

దీని వెనుక ఉన్న కారణం టైర్ల నలుపు రంగు వెనుక కారణం కూడా అదే. మొదట్లో టైర్లు తయారు చేసినప్పుడు అవి తెల్లగా ఉండటం వల్ల వాహనం బరువును తట్టుకోలేక పోయాయట. దాంతో వాటిని బలంగా చేయడానికి బ్లాక్ కార్బన్ ఉపయోగించబడింది. టీవీ విషయంలో కూడా అదే పరిస్థితి. టీవీ బాడీని బలంగా మార్చడానికి దాని తయారీ సమయంలోనే బ్లాక్‌ కార్బన్‌ మిక్స్ చేస్తారట.

ఇక, ఏసీ గురించి చెప్పాలంటే మార్కెట్లో చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ, పోర్టబుల్ ఏసీ వంటివి. ఈ అన్ని రకాల ఏసీల రంగు ఎక్కువగా తెల్లగా ఉంటుంది. ఆఫీసులో, ఇంట్లో మనం ఎక్కువగా తెల్లటి రంగులో ఉండే ఏసీని చూస్తుంటాం. వాస్తవానికి, AC బాడీ రంగు తెల్లగా ఉండటానికి కారణం తెలుపు రంగు సూర్యరశ్మిని తక్కువగా గ్రహిస్తుంది. అంటే తెలుపు రంగు సూర్యరశ్మిని ఎక్కువగా ఆకర్షించదు. దీని కారణంగా లోపల కంప్రెసర్ సురక్షితంగా ఉంటుంది. వేసవిలో సూర్య కిరణాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కిరణాలు తెలుపు రంగు వైపు తక్కువగా శోషించబడతాయి. సూర్యకిరణాలు AC మెషీన్‌కు చేరకుండా, వేడెక్కకుండా నిరోధించడానికి ఏసీలు తెలుపు లేదంటే, ఇతర లైట్ షేడ్స్‌లో ఉంటుంది. వేసవిలో వేడిని తట్టుకోవడానికి మనం తెల్లటి దుస్తులు ధరించినట్లే అదే కారణంతో ఏసీలకు తెల్లటి రంగు వేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…