AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదులుతున్న రైలు కిందపడబోయిన మహిళను కాపాడిన RPF లేడీ కానిస్టేబుల్.. నెటిజన్ల ప్రశంసలు..

సోషల్ మీడియాలో కూడా ఈ మహిళా ఉద్యోగినిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో @WesternRly ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఇది ఆ మహిళ తప్పిందగా చెబుతున్నారు. రైలు సమయానికి రావాలంటూ పలువురు సూచిస్తున్నారు.. మరో వినియోగదారు RPF జవాన్‌ చాకచక్యం, సమయస్పూర్తిని మెచ్చుకున్నారు.

కదులుతున్న రైలు కిందపడబోయిన మహిళను కాపాడిన RPF లేడీ కానిస్టేబుల్.. నెటిజన్ల ప్రశంసలు..
Rpf Constable Saved A Woman
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2023 | 7:01 PM

Share

రైల్వే ప్రమాదం గురించి మనం ప్రతిరోజూ అనేక వార్తలు వింటూనే ఉంటాం. ఆ ప్రమాదాలు చాలా వరకు వారి స్వంత తప్పిదం వల్ల జరుగుతున్నాయి. రన్నింగ్ లోకల్ ఎక్కేటప్పుడు కొన్నిసార్లు కాలు జారిపోతుంటారు. కొన్నిసార్లు డోర్‌వేలో నిలబడి ఉండగా, బ్యాలెన్స్ అదుపుతప్పి పడిపోతుంటారు. ఇలాంటి నిర్లక్షాలకు తావు లేకుండా రైల్వే అధికారులు, సిబ్బంది ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ప్రజలకు ఎంత చెప్పినా వినిపించుకోరు.. అదే నిర్లక్షం వహిస్తుంటారు. ఇప్పటికీ చాలా మంది ప్రయాణికులు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై కదులుతున్న రైలును పట్టుకోవడానికి ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తుంటారు. ముంబైలో ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చేరటంతో వెలుగులోకి వచ్చింది. 33 సెకన్ల నిడివి గల ఈ వీడియో హృదయాన్ని కదిలించేలా ఉంది.

రైలు ప్రమాదం నుంచి ఓ మహిళను కాపాడేందుకు రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌లోని ఓ మహిళా ఉద్యోగి తన ప్రాణాలను పణంగా పెట్టింది. నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళ బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ తర్వాత ఆమె ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందకు పడబోయింది. ఇంతలో డ్యూటీలో ఉన్న రైల్వే పోలీసు ఆలస్యం చేయకుండా ఎక్స్‌ప్రెస్ వైపు దూసుకెళ్లి మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఉత్కంఠ సీసీటీవీలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఆర్పీఎఫ్ జవాన్ అప్రమత్తమై ఆమెను రక్షించారు.

ఇవి కూడా చదవండి

ఉత్కంఠ రేపుతున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళను సురక్షితంగా బయటకు తీయడంతో, పోలీసులు, ప్రయాణికులు వెంటనే మహిళకు సహాయం చేయడం వీడియోలో కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో కూడా ఈ మహిళా ఉద్యోగినిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో @WesternRly ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఇది ఆ మహిళ తప్పిందగా చెబుతున్నారు. రైలు సమయానికి రావాలంటూ పలువురు సూచిస్తున్నారు.. మరో వినియోగదారు RPF జవాన్‌ చాకచక్యం, సమయస్పూర్తిని మెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి షాకింగ్ ఘటనే చోటుచేసుకుంది. ఆ సమయంలో రైల్వే పోలీసులు ధైర్యంగా ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..