AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Resolution: న్యూ ఇయర్‌లో టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారా? ఈ ఐదు అలవాట్లను తప్పకుండా పాటించండి…

కెరీర్‌లో విజయం సాధించాలనే పోరాటంలో.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడానికి తగినంత శ్రద్ధ, సమయం దొరకదు. అంతేకాదు.. తినే తిండి విషయంలో కూడా నిర్లక్ష్యం తప్పదు. ఇది మనస్సుతో పాటు శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరంలో మీ దినచర్యను కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని ఇష్టమైన హాబీలను అలవాటు చేసుకోండి.

New Year Resolution: న్యూ ఇయర్‌లో టెన్షన్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారా? ఈ ఐదు అలవాట్లను తప్పకుండా పాటించండి...
New Year Resolution
Jyothi Gadda
|

Updated on: Dec 23, 2023 | 4:16 PM

Share

కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో, మీ దినచర్యను కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని మీకు ఇష్టమైన హాబీలను అలవాటు చేసుకోండి. 2024లో మీరు ఎంచుకునే అద్భుతమైన ఈ ఐదు హాబీలను అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే.. కొత్త సంవత్సరంలో చాలా విషయాలకు పరిష్కరం దొరుకుతుంది.

కెరీర్‌లో విజయం సాధించాలనే పోరాటంలో.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడానికి తగినంత శ్రద్ధ, సమయం దొరకదు. అంతేకాదు.. తినే తిండి విషయంలో కూడా నిర్లక్ష్యం తప్పదు. ఇది మనస్సుతో పాటు శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి రాబోయే సంవత్సరంలో మీ దినచర్యను కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని ఇష్టమైన హాబీలను అలవాటు చేసుకోండి.

2024లో మీరు ఎంచుకునే అద్భుతమైన ఐదు హాబీలు అలవర్చుకోండి..అందులో చదవటం, ఏడైన ఆటలో ప్రాక్టీస్‌, ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం, వ్యాయామం, ఆహారంలో మార్పులు మొదలైన వాటితో పాటు, మీరు మీ రోజువారీ జీవితంలో మీ అలవాట్లను చేర్చుకోవచ్చు. ఇది మీరు ఒత్తిడి లేని జీవితాన్ని గడపటానికి దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

1. చదవండి: మీ రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి పుస్తకాలు చదవడం ఒక ఆహ్లాదకరమైన అభిరుచిగా అవుతుంది. ఇది మీ పఠనం, రాయడం నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వచ్చే ఏడాదిలో ఐదు లేదా పది పుస్తకాలు చదవాలని లక్ష్యంగా పెట్టుకోండి.

2. కొత్త భాషను నేర్చుకోండి: కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్త భాషను నేర్చుకునే ప్రయత్నం చేయండి.. ఇతర భాష ఎలా మాట్లాడాలో లేదా రాయాలో రోజూ ప్రాక్టీస్‌ చేస్తుండటం మంచి హాబీ అవుతుంది.

3. ఏదైనా ఒక కళను అలవాటు చేసుకోండి : మీరు ఒరిగామి కళను నేర్చుకోవడం ద్వారా కాగితం నుండి విభిన్న విషయాలను సృష్టించే వినోదాన్ని కూడా ఆస్వాదించవచ్చు. లేదా నోట్‌బుక్‌లో ప్రతిరోజూ అందమైన చిత్రాలను గీయండి మరియు వాటికి వివిధ రంగులలో పెయింటింగ్స్‌ వేయండి.

4. ఏదైనా గేమ్స్ ఆడండి : మీరు మీ బిజీ లైఫ్‌లో కొంత సమయాన్ని ఏదైనా క్రీడ కోసం వెచ్చించండి. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, షెటిల్‌ మొదలైన అవుట్‌డోర్ గేమ్‌లను ఆడండి. ఇలా చేస్తూ రోజు ఒత్తిడిని వదిలించుకోండి.

5. ఫోటోగ్రఫీ: కొంతమంది మొక్కలు, ఆకులు, పువ్వులు మొదలైన వాటి ఫోటోలను తీయడానికి ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా వివిధ కొత్త ప్రదేశాలను సందర్శించి అక్కడి అందమైన క్షణాలను మీ కెమెరా లేదా మొబైల్ ఫోన్‌లో క్యాప్చర్ చేయండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ప్రకృతిలో కొంత సమయం గడపండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..