AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd in Winter: శీతా కాలంలో పెరుగు తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది?

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు కానీ, మజ్జిగ కానీ తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. పెరుగు తింటే శరీరానికి చలువ చేస్తుంది. అంతే కాదు పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ కూడా. కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండేందుకు పెరుగు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు.. ప్రతి రోజూ కనీసం ఒక కప్పు పెరుగు..

Curd in Winter: శీతా కాలంలో పెరుగు తినొచ్చా.. తింటే ఏం జరుగుతుంది?
Curd In Winter- స్మూతీస్ మరియు పెరుగు రోగనిరోధక శక్తిని పెంచే రెండు రుచికరమైన ఆహారాలు. వాటిలో విటమిన్లు, లిపిడ్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Chinni Enni
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 23, 2023 | 6:03 PM

Share

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగు కానీ, మజ్జిగ కానీ తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. పెరుగు తింటే శరీరానికి చలువ చేస్తుంది. అంతే కాదు పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ కూడా. కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండేందుకు పెరుగు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు.. ప్రతి రోజూ కనీసం ఒక కప్పు పెరుగు తినమని సూచిస్తూ ఉంటారు. అయితే శీతా కాలంలో జలుబు చేస్తుందని చాలా మంది దూరం పెడతారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్లు బి2 వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి అనేది అందుతుంది. దీంతో ఇతర రకాల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అలాగే ఇతర సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా చూస్తుంది. జలుబు, తుమ్ములు, అలర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి.

జీర్ణ క్రియకు మంచిది:

శీతాకాలంలో కూడా పెరుగు తినడం వల్ల జీర్ణ క్రియ అనేది సవ్యంగా జరుగుతుంది. దీంతో మల బద్ధకం సమస్య ఉండదు. కడపులో నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పొట్ట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వలన.. గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

ఇవి కూడా చదవండి

చర్మానికి మంచిది:

శీతా కాలంలో పెరుగును తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది. చర్మంపై మచ్చలు, అలర్జీ సమస్యలు, పొడి బారడం వంటివి రాకుండా ఉంటాయి. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.

ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి:

పెరుగులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటుంది. క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతే కాకుండా పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు కూడా అదుపులోకి వస్తుంది.

డయాబెటీస్ అదుపు:

మధు మేహం పేషెంట్లు క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పెరుగు రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

బరువు కూడా తగ్గుతారు:

శీతాకాలంలో బరువు తగ్గాలి అనుకునే వారు పెరుగును హ్యాపీగా తీసుకోవచ్చు. పెరుగులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.