Betel Leaf Benefits: తమలపాకుతో ఎన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చో తెలుసా!
తమల పాకులను పండుగ సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పూజలకు, ముత్తైదువుకు తాంబూలం ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే తమల పాకులతో పాన్ లు చేస్తారు. మరికొంత మంది బజ్జీలు కూడా వేస్తారు. కానీ తమల పాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు రాకుండా చెక్..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 23, 2023 | 6:03 PM

తమల పాకులను పండుగ సమయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పూజలకు, ముత్తైదువుకు తాంబూలం ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంత మంది అయితే తమల పాకులతో పాన్ లు చేస్తారు. మరికొంత మంది బజ్జీలు కూడా వేస్తారు. కానీ తమల పాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు రాకుండా చెక్ పెట్టొచ్చు.

కీళ్లు నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా తమల పాకు బాగా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా తమలపాకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇంకా తమల పాకుతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకును తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా రక్త ప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది. అంతే కాకుండా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగుతాయి.

తమల పాకుతో కేవలం పెద్దలకు మాత్రమే కాదు చిన్న పిల్లల పొట్టకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించవచ్చు. శీతాకాలంలో చిన్న పిల్లలకు తరచుగా జలుబు వస్తే.. తమలపాకుపై కొంచెం పసుపు రాసి.. తలపై ఉంచాలి. ఇలా చేస్తే త్వరగా జలుబు కంట్రోల్ లోకి వస్తుంది.

నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్న వారు కూడా తమలపాకుతో తయారు చేసే హల్వా తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. తమలపాకు హల్వా తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.





























